సచిన్ లాగానే రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌ లోనే సెంచరీ చేసిన అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar Scores Century On Ranji Trophy Debut For Goa Replicates Father Sachin Tendulkar's Feat,Arjun Tendulkar,Arjun Tendulkar Scores Century,Ranji Trophy Debut,Ranji Trophy Goa,Mango News,Mango News Telugu,Arjun Tendulkar Height,Arjun Tendulkar Wife,Arjun Tendulkar Cricbuzz,Arjun Tendulkar Stats,Arjun Tendulkar Education,Arjun Tendulkar Ipl 2022,Arjun Tendulkar Bowling Speed,Arjun Tendulkar Ipl Auction 2022,Arjun Tendulkar Ipl Debut,Arjun Tendulkar Playing In Ipl 2022,Danielle Wyatt Arjun Tendulkar

దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ తనయుడు, క్రికెటర్ అర్జున్‌ టెండూల్కర్ తన రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌ లోనే సెంచరీ చేశాడు. 1988లో 15 ఏళ్ల వయసులో సచిన్‌ టెండూల్కర్ తను ఆడిన మొదటి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 35 ఏళ్ల తర్వాత సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా అలాంటి ఘనతను సాధించి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. స్వరాష్ట్రమైన ముంబాయి రంజీ టీమ్ లో పోటి ఎక్కువగా ఉండటంతో, గోవా జట్టు తరుపున అర్జున్ టెండూల్కర్ రంజీల్లో అరంగ్రేట్రం చేశాడు.

రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా మంగళవారం రాజస్థాన్‌, గోవా జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవగా, రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో గోవా జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగింది. గోవా జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 493 పరుగులు చేసింది. తొలి రోజు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్‌ 12 బంతుల్లో 4 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. ఇక రెండు రోజున అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శనతో 207 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు సహాయంతో 120 పరుగులు చేశాడు.

మరో గోవా ఆటగాడు ప్రభుదేశాయ్‌ (212) తో కలిసి అర్జున్‌ కీలక ఇన్నింగ్స్‌ను ఆడాడు. అర్జున్, ప్రభుదేశాయ్‌ కలిసి ఆరో వికెట్‌కు 221 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగా 2018లో అండర్-19 క్రికెట్‌లో అర్జున్‌ టెండుల్కర్ అరంగేట్రం చేశాడు. అనంతరం బౌలింగ్ ఆల్ రౌండర్ గా (లెప్ట్ ఆర్మ్ మీడియం పాస్ట్ బౌలర్) అర్జున్ క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ లో గత రెండు ఏళ్లుగా ముంబయి ఇండియన్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్ కొనసాగుతున్నప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశం ఇంత వరకు రాలేదు. ఇటీవలే రంజీల్లో గోవా జట్టుకు వెళ్లాలని నిర్ణయించుకుని, ముంబయి క్రికెట్ అసోసియేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే గోవా జట్టు తరుపున మొదటి రంజీ మ్యాచ్ లోనే అర్జున్‌ టెండూల్కర్ సెంచరీతో సత్తాచాటాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − eleven =