అహ్మదాబాద్‌లో ‘ప్రముఖ్ స్వామి మహరాజ్’ శతాబ్ది వేడుకలు, ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Participates in Inaugural Function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav at Ahmedabad Today,Pramukh Swami Maharaj,Swami Maharaj Shatabdi Mahotsav,PM Modi Inaugural Function,Mango News,Mango News Telugu,Pramukh Swami Maharaj Quotes,Pramukh Swami Maharaj Prasang,Mahant Swami Maharaj,Pramukh Swami Maharaj Diksha,Pramukh Swami Maharaj Education,Pramukh Swami Maharaj Jivan Charitra,Pramukh Swami Maharaj Janma Jayanti,Pramukh Swami Maharaj Janma Jayanti 2022

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను స్పృశించిన మార్గదర్శి ‘ప్రముఖ్ స్వామి మహారాజ్’ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఆయన అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ (100వ జయంతి) వేడుకలను ప్రారంభించిన అనంతరం కార్యక్రమంలో ప్రసంగించారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 100 ఏళ్ల క్రితమే ఆయన గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ప్రముఖ్ స్వామి మహరాజ్ జీవితం మొత్తం మానవ సేవకు అంకితం చేశారని, అలాగే స్వామినారాయణ్ సంస్థ యొక్క నాయకుడిగా, ఆయన లెక్కలేనన్ని సాంస్కృతిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. ఈ క్రమంలో మహరాజ్ లక్షలాది మందికి ఓదార్పు మరియు స్వాంతన కలిగించారని పేర్కొన్నారు.

కాగా ఈ కార్యక్రమాన్ని బీఏపీఎస్ స్వామినారాయణ్ సంస్థ నిర్వహిస్తుంది.  ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవం సందర్భంగా స్వామినారాయణ్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అయిన షాహీబాగ్‌లోని స్వామినారాయణ్ మందిర్‌లో డిసెంబరు 15 నుండి జనవరి 15, 2023 వరకు నెల రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో రోజువారీ ప్రత్యేక ఈవెంట్‌లు, నేపథ్య ప్రదర్శనలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ రింగ్ రోడ్డు వెంబడి ఉన్న ‘ప్రముఖ్ స్వామి మహారాజ్ నగర్’ అనే 600 ఎకరాల స్థలంలో ఈ మందిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మరియు ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన నూతన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =