వర్షాలతో భారీనష్టం, ఏపీలో 3 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటన

Andhra Pradesh, AP Floods, AP Floods Damage, AP Floods News, AP Rains, AP Rains And Floods, Central Team to Tour in AP, Central Team to Tour in AP From November 26 to 28 To Assess the Loss Due to Rains And Floods, Central team to visit flood-hit areas in AP, Central team visits flooded areas, Central team visits flooded areas in AP, Central team visits flooded areas in city, Central teams assess rain damage in AP, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20 వరకు కడప, చిత్తూరు, అనంతపురం మరియు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వ‌ర‌దల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం నవంబర్ 26 నుండి 28 వరకు మూడు రోజులపాటుగా ఏపీలో పర్యటించనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ (ఎన్డీఎంఏ) కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలుగా ఏపీలో పర్యటించనున్నారు.

నవంబర్ 26, శుక్రవారం నాడు కేంద్ర బృందం చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది. నవంబర్ 27, శనివారం నాడు చిత్తూరు జిల్లాలో ఒక బృందం, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక బృందం పర్యటించనుంది. ఇక నవంబర్ 28, ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలోనే రెండు బృందాలు పర్యటించనున్నాయి. ఇక అన్ని జిల్లాల్లో పర్యటన అనంతరం సోమవారం ఉదయం కేంద్రబృందం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + four =