కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్ పై రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం కీలక సూచనలు

Alert over new Covid variant in 3 countries, Center Alerts All States and Union Territories, Center Alerts All States and Union Territories over New Covid-19 Variant B.1.1529, Centre cautions states on new Covid variant, Centre flags new variant, Centre issues alert over South Africa’s new COVID variant, Centre issues fresh advisory to states, Centre Warns Against Dangers of New Covid Strain, Centre writes to states warning of new COVID variant, COVID-19, Mango News, New Covid 19 Variant, New Covid variant puts India on alert, New Covid-19 Variant B.1.1529

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా వెలుగులోకి వచ్చిన మరో కొత్త కరోనా వేరియంట్‌ (బి.1.1.529) పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బి.1.1.529 వేరియంట్ కేసులు దక్షిణాఫ్రికాలో 6, బోత్స్వానాలో 3, హాంకాంగ్ లో ఒకటి నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసి పలు కీలక సూచనలు చేశారు. దక్షిణాఫ్రికా, బోత్స్వానా మరియు హాంకాంగ్ వంటి మూడు దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించే ప్రయాణికులను రిస్క్ కంట్రీ కేటగిరిలో భాగంగా పరిగణించి కఠినమైన స్క్రీనింగ్‌ జరిపి, పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించారు. అలాగే సవరించిన గైడ్ లైన్స్ ఆధారంగా ఇతర రిస్క్ కంట్రీ కేటగిరి నుంచి వచ్చే ప్రయాణికులను కూడా నిశితంగా పర్యవేక్షించి, పరీక్షలు చేయాలని సూచించారు.

బి.1.1.529 వేరియంట్‌లో గణనీయమైన సంఖ్యలో ఉత్పరివర్తనలు ఉన్నట్లు నివేదించబడిందని, ఇటీవల సడలించిన వీసా పరిమితులు మరియు అంతర్జాతీయ ప్రయాణాలు మళ్ళీ మొదలైన దృష్ట్యా, దేశంలో తీవ్రమైన ప్రజారోగ్య ప్రభావాలను కలిగించే అవకాశం ఉందన్నారు. అందువలన అన్ని రాష్ట్రాలు విదేశాల నుండి వచ్చే కోవిడ్ పాజిటివ్ ప్రయాణికుల నుండి నమూనాలను సేకరించి జెనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియం (ఇన్సాకాగ్) యొక్క నిర్దేశిత ల్యాబ్‌లకు పంపవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇన్సాకాగ్ దేశంలోకి వచ్చే వేరియంట్ ఆఫ్ కాన్సర్న్, వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ లను ట్రాక్ చేసి, పర్యవేక్షిస్తుందని చెప్పారు. అలాగే రాష్ట్రాల్లోని కోవిడ్ నిఘా అధికారులు ఇన్సాకాగ్ ల్యాబ్‌లతో సమన్వయం చేసుకుని, కరోనా వేరియంట్ మరియు ఫార్మేషన్ కేస్ క్లస్టర్‌ల వ్యాప్తిని నిరోధించడానికి టెస్ట్-ట్రాక్-ట్రీట్‌ విధానాన్ని చేపట్టాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − twelve =