మరో స్థానాన్ని ప్రకటించిన చంద్రబాబు

Chandrababu, constituency, Chandrababu announced another constituency, Chandrababu Naidu, TDP, AP Elections, Kolusu Parthasarathy, YSRCP, Andhra Pradesh, CM Chandrababu Naidu, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, Mango News Telugu, Mango News
Chandrababu Naidu, TDP, AP Elections, kolusu parthasarathy

రెండు స్థానాలను ప్రకటించి ఏపీలో కాక రేపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే పొత్తు ధర్మం పాటించకుండా.. చంద్రబాబు ఏక పక్షంగా వెళ్లడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున బహిరంగంగానే చంద్రబాబుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. అంతేకాకుండా టీడీపీ రెండు స్థానాలను ఖరారు చేసినందున.. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాలను ప్రకటించేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. ఆయా స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతోంది. ఈక్రమంలో అగ్గికి ఆజ్యం పోసేలా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏకంగా మరో నియోజకవర్గాన్ని కూడా ప్రకటించేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడు నుంచి తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా ఆ స్థానానికి అభ్యర్థిని కూడా ఫైనల్ చేశారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి నూజివీడు టికెట్ ఫైనల్ చేశారు.

ఇటీవలే కొలుసు పార్థసారథి వైసీసీకి రాజీనామా చేశారు. ఆయనకు పెనమలూరు టికెట్‌ను వైసీసీ హైకమాండ్ నిరాకరించింది. ఆయన స్థానాల్లో కొత్త వారిని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల గుడివాడలో నిర్వహించిన సభలోనే పార్థసారథి టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ టికెట్‌పై అప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాకపోవడంతో.. పార్థసారథి టీడీపీలో చేరిక వాయిదా పడింది.

అయితే ఇప్పుడు అధికారికంగానే చంద్రబాబు నూజివీడు టికెట్ పార్థసారథికి ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో త్వరలోనే టీడీపీ కండువా కప్పుకొని.. కదనరంగంలోకి దూకేయాలని పార్థసారథి అనుకుంటున్నారట. ఫిబ్రవరి 1న చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్థసారథి టీడీపీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే టీడీపీపై జనసేన గుర్రుగా ఉంది. ఏకపక్షంగా వ్యవహరించడంపై భగ్గుమంటోంది. ఇప్పుడు టీడీపీ ఏకంగా మరో స్థానాన్నే ప్రకటించేసింది. మరి దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − nine =