ఎమ్మెల్సీ అశోక్‌బాబుకి టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శ

Chandrababu Naidu Serious Comments on AP Govt Against TDP MLC Ashok Babu Arrest, Chandrababu Naidu Serious Comments on AP Govt, Chandrababu Naidu Serious Comments, TDP MLC Ashok Babu Arrest, Andhra Pradesh, AP CID police arrest TDP MLC Ashok Babu, Ashok Babu Arrested By AP CID in The Midnight, Mango News, Mango News Telugu, MLC Ashok Babu, MLC Ashok Babu Arrest, MLC Ashok Babu Arrest News, MLC Ashok Babu Arrested, Naidu decries midnight arrest of Ashok Babu, TDP MLC Ashok Babu Arrested, TDP MLC Ashok Babu Arrested By AP CID, TDP MLC Ashok Babu Arrested By AP CID in The Midnight, TDP MLC Ashok Babu arrested in forgery,

ఎమ్మెల్సీ అశోక్‌బాబును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి ఏపీ సీఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు అశోక్‌బాబుకు సీఐడి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. దీంతో ఆయన స్వగృహానికి చేరుకున్నారు.ఈనేపథ్యంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అశోక్‌బాబును కలుసుకుని పరామర్శిస్తున్నారు. ఈక్రమంలోనే, ఈరోజు జాస్తివారి వీధిలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సీఐడీ అరెస్ట్ తదనంతర పరిణామాలపై అశోక్‌బాబును అడిగి తెలుసుకున్నారు. కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించారని చంద్రబాబుకు అశోక్‌బాబు తెలిపారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

‘‘ఎమ్మెల్సీ అశోక్‌బాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. అశోక్‌బాబు తప్పు చేసి ఉంటే ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చు, కానీ పోలీసులు ఇలా అర్ధరాత్రి అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. సీఎం చెప్పినా, పోలీసులు విజ్ఞతతో వ్యవహరించాలి అని అన్నారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే ఎప్పటికైనా మీరు బలిపశువులు అవుతారు. అది తెలుసుకుని ప్రవర్తించండి అని పోలీసులకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే పాలకులకు నచ్చడంలేదు. అంతమాత్రాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, ఇప్పటికే ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. మరో 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. అన్యాయంగా 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. మరి అప్పుడు పోలీసులు ఏం చేశారు? రాష్ట్రంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి తరపునా టీడీపీ పోరాడుతుంది” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 19 =