పరిటాల ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన చంద్రబాబు

Paritala Family, TDP, Chandrababu, Paritala sriram, Paritala Sunitha, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, andhra pradesh, ap political updates, chandrababu politics, Mango News Telugu, Mango News
Paritala Family, TDP, Chandrababu, Paritala sriram, Paritala Sunitha

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచేశారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై నిమగ్నమయ్యారు. ఇప్పటికే జనసేనతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న చంద్రబాబు.. ఆ పార్టీకి 35 సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అటు బీజేపీ నుంచి కూడా సానుకూల సంకేతాలు అందుతున్నాయి. పొత్తుకు కాషాయపు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో బీజేపీకి కూడా పది నుంచి పన్నెండు స్థానాలు పక్కన పెట్టి మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

అయితే ఈసారి ఫ్యామిలీకి ఒకే టికెట్ ఇస్తామని ముందే చంద్రబాబు తేల్చేశారు. టికెట్ ఆశిస్తున్నవారు చంద్రబాబుపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కోట్ల, అయ్యన్న పాత్రుడు, జేసీ కుటుంబాలకు ఒకే సీట్లు ఇస్తున్నట్లు చెప్పేశారు. ఈక్రమంలో పరిటాల ఫ్యామిలీకి కూడా ఒకే టికెట్ ఇస్తున్నటన్లు తెలుస్తోంది. వాస్తవానికి పరిటాల ఫ్యామిలీ రెండు స్థానాలు కోరుతోంది. రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టారట.

అయితే ఇప్పటికే ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో ఆయన నియోజకవర్గంలో స్పీడ్ పెంచేశారట. ఈక్రమంలో సూరి, పరిటాల శ్రీరామ్‌ల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లు చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ప్రధానంగా సీట్ల గురించి వారు చర్చలు జరిపారట. రాప్తాడు, ధర్మవరం టికెట్లను తమకు కేటాయించాలని సునీత.. చంద్రబాబును కోరారట.

అయితే వారు కోరిన రెండు చోట్ల తమ ప్రత్యర్థులు బలంగా ఉన్నారని వారితో చంద్రబాబు అన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండు స్థానాల్లో పోటీకి దిగితే ఆర్థికంగా తట్టుకోలేరేమో ఆలోచించుకోండి అని సూచించారట. ఒకవేళ పరిటాల ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇస్తే.. ఇతర నేతలు, సీనియర్ల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేమని చంద్రబాబు భావిస్తున్నారట. ఈక్రమంలో పరిటాల సునీత, శ్రీరామ్‌లకు రెండు సీట్లు ఇవ్వలేమని చెప్పకనే చెప్పారట చంద్రబాబు నాయుడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 20 =