గుంటూరులో సీన్ రివర్స్ కాబోతోందా?

Is The Guntur Scene Reversing With Pemmasani Chandrasekhar's Entry?, Is The Guntur Scene Reversing, Guntur Scene Reversing, Pemmasani Chandrasekhar Entry, Pemmasani Chandrasekhar Entry Guntur, Pemmasani Chandrasekhar, TDP, Guntur TDP MP Candidate, Lok Sabha Elections, AP Elections, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani chandrasekhar, TDP, Guntur tdp mp candidate, lok sabha elections

గుంటూరు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ రాక‌ముందే.. అభ్య‌ర్థులు ఎవ‌రో అధికారికంగా తేల‌క‌ముందే.. రాజ‌కీయ‌పార్టీలు హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. అయితే.. ఈసారి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు, ఆ ప‌రిధిలో ఉన్న ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గాలి ప‌సుపు పార్టీ వైపు వీస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. బుర్రిపాలెం బుల్లోడిగా పేరొందిన.. సూప‌ర్ స్టార్ కృష్ణ కాదండోయ్‌.. మ‌నం చెప్పుకునేది రాజ‌కీయాల గురించి కాబ‌ట్టి.. బుర్రిపాలెం బుల్లోడు అంటే.. డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌. కానీ.. ఆయ‌న బుల్లోడిలా సాఫ్ట్ గా కాదు.. బుల్లెట్‌లా వేగంగా దూసుకెళ్తున్నాడు.. అందుకేనేమో.. ఈసారి గాలి ప‌సుపార్టీ టీడీపీ వైపే వీస్తోంది. గుంటూరు పార్ల‌మెంట్ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పెమ్మ‌సానిని అధిష్ఠానం ఖ‌రారు చేసింద‌న్న ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టి నుంచీ ఆ పార్టీలో జోరు మొద‌లైంది.

అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన హామీతో టీడీపీ అభ్య‌ర్థిగా పెమ్మ‌సాని ప్ర‌చారం మొద‌లుపెట్టి నాటి నుంచీ నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ.., ఊరూ.. వాడా తిరుగుతూ.. తెలుగుదేశం జెండా ఎగిరేలా పాటుప‌డుతున్నారు. జిల్లాలో టీడీపీ మ‌రింత ఆద‌ర‌ణ పొందేలా కృషి చేస్తున్నారు. ఫ‌లితంగా.. గుంటూరు పార్ల‌మెంట్‌ను మూడోసారి టీడీపీయే త‌న ఖాతాలో వేసుకుంటుంద‌న్న ప్ర‌చారంతో పాటు.., 2019 నాటి సీన్ రివ‌ర్స్ అవుతూ.. పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా తెలుగుదేశం జెండాయే ఎగురుతుంద‌న్న అంచ‌నాలు పెరుగుతున్నాయి.

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవే.. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ . 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో ఆరు సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 2019 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 17,04,431. వీరిలో ఎస్సీ ఓటర్లు 3,30,660 మంది.. ఎస్టీ ఓటర్లు 56,246 మంది.. రూరల్ ఓటర్లు 8,64,147 మంది.. అర్బన్ ఓటర్లు 8,40,284 మంది. వారిలో ఎక్కువ మంది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫ్యాను గుర్తుకే ఓటువేశారు. అయితే.. ఈసారి స‌మీక‌ర‌ణాలు మారాయ‌ని, అంద‌రి చూపూ సైకిలు గుర్తు బ‌ట‌న్ వైపే ఉంటుంద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

పార్లమెంట్‌లో ఏపీ వాణిని బ‌లంగా వినిపించి.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి సైతం ప్ర‌శంస‌లు పొందిన సిట్టింగ్ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. ఈసారి పోటీ నుంచి త‌ప్పుకున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు క‌క్ష సాధింపు చ‌ర్య‌ల వ‌ల్లే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న స్థానంలో గుంటూరు లోక్ స‌భ టీడీపీ టికెట్ పొందిన పెమ్మ‌సాని.. వైసీపీకి బ‌ల్లెంలా మారాడు. గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలో అడుగు పెట్టిన నాటి నుంచీ ప్ర‌త్య‌ర్థి పార్టీని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నారు. ఎక్క‌డ చూసినా సొంత పార్టీ టీడీపీ గురించే చ‌ర్చ జ‌రిగేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా పార్ల‌మెంట్‌లో టీడీపీ హ్యాట్రిక్ ఖాయ‌మ‌ని.. 2019 ఎన్నిక‌ల‌ ఫ‌లితాల‌ను తిర‌గ‌రాస్తూ.. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా తెలుగుదేశం జెండాయే ఎగురుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − four =