జనసేన అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత

Strong Opposition To Jana Sena Candidate In Tirupati, Strong Opposition To Jana Sena Candidate, Tirupati Jana Sena Candidate, Tirupati Candidate, Chandrababu, Lokesh, TDP, Janasena, Congress, YCP, BJP, Pawan Kalyan, Jana Sena Candidate In Tirupati, Tirupati, Mango News, Mango News Telugu
Chandrababu, Lokesh, TDP, Janasena, Congress, YCP, BJP, Pawan Kalyan,Jana Sena candidate in Tirupati,Tirupati

టెంపుల్ సిటీలో  పొత్తుల పేచీ పొలిటికల్ హీట్‌ను పెంచింది. టీడీపీ,జనసేన , బీజేపీ పొత్తు వ్యవహరంతో తిరుపతిలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో.. అసంతృప్తిగా ఉన్న టీడీపీ కేడర్ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులును బరిలో నిలపడంతో అసహనం వ్యక్తం చేస్తోంది.

చిత్తూరు అసెంబ్లీ టికెట్ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ  కూటమిలో మూడు పార్టీల నుంచి  కూడా పోటీ ఎక్కువగానే ఉంది.  పొత్తులో భాగంగా తిరుపతిలో పోటీ చేసే అవకాశాన్ని  దక్కించుకున్న జనసేన.. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు అవకాశమిచ్చింది. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరణి శ్రీనివాసులు తాజాగా వైసీపీని వీడి జనసేనలో చేరారు.అయితే ఇప్పుడు అరణి శ్రీనివాసులుకు తిరుపతి అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేన వర్గాలలో  బలిజ సామాజిక వర్గం నుంచి అసంతృప్తి  వ్యక్తమవుతోంది.

తిరుపతి టికెట్‎ కోసం  టీడీపీ నుంచి ఆరుగురు, జనసేన నుంచి ఇద్దరు ఆశావాహులు  పోటీ పడ్డారు. అయితే తిరుపతి సీటును జనసేనకు ఇవ్వాల్సి రావడంతో టీడీపీ ఆశావాహులకు నో చెప్పిన అధిష్టానం.. జనసేన అభ్యర్థిని గెలిపించడానికి  పని చేయాలని ఆదేశించింది. అయితే హై కమాండ్ తీసుకున్న నిర్ణయంతో టీడీపీ శ్రేణులలోనూ భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి తిరుపతి ఎన్నికల్లో  కనిపించిన తెలుగుదేశం పార్టీ సింబల్ ఈ ఎన్నికల్లో కనిపించదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు  ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు తిరుపతి అసెంబ్లీ సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేటాయించడాన్ని స్థానిక నేతలు  తప్పు పడుతున్నారు.

పవన్ పోటీ చేయకపోతే లోకల్ టీడీపీ – జనసేన నేతలకు టికెట్ కేటాయించాలనే డిమాండ్‎ను వినిపిస్తున్నారు. జనసేన అధిష్టానం దీనిపై స్పందించకపోతే ఇండిపెండెంట్‎గా పోటీ చేస్తామనంటున్నారు. దీనిలో భాగంగానే తిరుపతిలో ఓ హోటల్లో టీడీపీ – జనసేన నేతల సమావేశం నిర్వహించి.. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమనే అభిప్రాయానికి వచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =