4 సూత్రాలు పాటిద్దాం, కరోనా వ్యాప్తి అరికడదాం : మంత్రి ఈటల రాజేందర్

Covid Guidelines, Covid Guidelines In Telangana, COVID-19 surge, Eatala urges citizens to cooperate with Covid-19 containment, Etala Rajender, Etala Rajender Appealed People to Follow Covid 19 Guidelines, Etala Rajender Appealed People to Follow Covid Guidelines, Mango News, Minister Etala Rajender, Telangana Coronavirus, Telangana Health Minister, Telangana Minister, Telangana Minister Etala Rajender, Telangana Minister Etala Rajender Appealed People to Follow Covid Guidelines

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలు నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల నుండి గ్రామాల్లోకి వచ్చే వారిపై దృష్టి పెట్టామని తెలిపారు. 4 సూత్రాలు పాటిద్దాం, కరోనా వ్యాప్తి అరికడదామని మంత్రి పిలుపునిచ్చారు. “45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరం విధిగా వాక్సిన్ వేయించుకుందాం. అన్ని వేళలా మాస్క్ ధరిద్దాం. చేతులు తరచుగా శుభ్రం చేసుకుందాం. భౌతిక దూరం పాటిద్దాం” వంటి 4 నాలుగు సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు.

అలాగే అవసరం ఉంటే తప్ప ఇంటినుండి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని, నిర్లక్ష్యం చేసిన వారికి ప్రాణాపాయం ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సలహాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కరోనా కట్టడికి, మరణాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 19 =