విశాఖ పర్యటనలో సీఎం జగన్.. ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద రూ. 261.51 కోట్లు పంపిణీ

CM Jagan Distributes YSR Vahana Mitra Scheme 4th Phase Aid at Visakhapatnam Today, AP CM Jagan Distributes YSR Vahana Mitra Scheme 4th Phase Aid at Visakhapatnam Today, AP CM YS Jagan Distributes YSR Vahana Mitra Scheme 4th Phase Aid at Visakhapatnam Today, YSR Vahana Mitra Scheme 4th Phase Aid at Visakhapatnam, YSR Vahana Mitra Scheme 4th Phase Aid, 4th Phase Of YSR Vahana Mitra Scheme, YSR Vahana Mitra Scheme, AP CM YS Jagan Visakhapatnam Visit, AP CM YS Jagan Visakhapatnam Tour, YSR Vahana Mitra Scheme News, YSR Vahana Mitra Scheme Latest News, YSR Vahana Mitra Scheme Latest Updates, YSR Vahana Mitra Scheme Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం నాలుగో విడత ఆర్ధికసాయాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేదికపై లబ్దిదారులకు రూ. 261.51 కోట్లు సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి మాటల్లోనే..

  • పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం ప్రారంభించాం.
  • దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తున్నాం.
  • కరోనా మహమ్మారి సమయంలోనూ పథకం ఆగకుండా లబ్దిదారులకు నగదు పంపిణీ చేశాం.
  • ఈ మూడేళ్లలో రూ. 1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం.
  • వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నాం.
  • ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు.
  • అలాంటి వారందరికీ గల ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వం తరపున అందిస్తున్నాం.
  • ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఈ ఏడాది మొత్తం 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నాం.
  • ఈ నాలుగు విడతల్లో ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేశాం.
  • రాష్ట్రంలో లంచాలు, వివక్ష లేకుండా కులం, మతం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − three =