భద్రాచలంలో వరద పరిస్థితులు: హెలికాప్టర్, రక్షణ సామాగ్రి తరలించాలని సీఎస్‌ కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

Godavari Flood Situation in Bhadrachalam CM KCR Orders CS to Move Helicopter and Rescue Equipment, CM KCR Orders CS to Move Helicopter and Rescue Equipment, Telangana CM KCR Orders CS to Move Helicopter and Rescue Equipment, KCR Orders CS to Move Helicopter and Rescue Equipment, CS to Move Helicopter and Rescue Equipment, Helicopter and Rescue Equipment, Telangana Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary, Somesh Kumar, Godavari Flood Situation in Bhadrachalam, Godavari Flood Situation, Godavari Flood Situation in Bhadrachalam News, Godavari Flood Situation in Bhadrachalam Latest News, Godavari Flood Situation in Bhadrachalam Latest Updates, Godavari Flood Situation in Bhadrachalam Live Updates, Mango News, Mango News Telugu,

భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో వరదముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోనే వుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములౌతున్నారు. ఈ నేపథ్యంలో ఊహించని వరదలకు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, రెస్క్యూ టీంలు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు అప్రమత్తంగా వుంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కాపాడుతుంది.

భద్రాచలంకు హెలికాప్టర్, రక్షణ సామాగ్రి తరలించాలని సీఎస్‌ కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు:

ఈ క్రమంలో భధ్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాంతో పాటు వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగపడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం కొనసాగుతుంది. వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తడంతో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. జూలై 15, శుక్రవారం ఉదయం 12:00 గంటలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 69.00 అడుగులకు చేరుకుందని, క్రిందికి నీటి విడుదల 23,15,934 క్యూస్సెకులగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ అనుదీప్ భధ్రాచలంలోనే ఉంటూ, నిరంతరం వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలో గోదావరి వరద ఉదృతికి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుండడంతో మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 13 =