రెండోదశ వైఎస్ఆర్ వెటర్నరీ మొబైల్ అంబులెన్స్ క్లినిక్‌లను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan Launches 165 YSR Veterinary Mobile Ambulance Clinics For Second Phase at Tadepalli Today,Cm Jagan Inaugurated,Second Phase Of Ysr Veterinary Mobile Ambulance Clinics,Ysr Veterinary Mobile Ambulance Clinics,Mango News,Mango News Telugu,Ap Veterinary Ambulance Toll Free Number,Ysr Animal Ambulance Number,Veterinary Ambulance Number,Government Animal Ambulance Number,Animal Mobile Medical Ambulance Vacancy,Animal Ambulance Number In Telangana,Ysr Veterinary Ambulance,Ysr Animal Ambulance,Ap Veterinary Ambulance Number,Ysr Pasu Ambulance,Ap Veterinary Ambulance

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పశువులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించేందుకు ‘వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవల’ (మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినికల్ సర్వీసెస్)ను తీసుకొచ్చిన ప్రభుత్వం వాటిని మరింతగా విస్తరించడానికి పూనుకుంది. దీనిలో భాగంగా రూ.111.62 కోట్లతో 165 పశువుల అంబులెన్స్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుండి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మరియు ఇతర పశు వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా మొత్తం 278 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 340 వెటర్నరీ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసే క్రమంలో నేడు రెండో దశ ద్వారా రూ.111 కోట్లకు పైగా వ్యయంతో 165 వెటర్నరీ అంబులెన్సుల సర్వీసులను ప్రారంభించారు.

ఇక గతేడాది మే 19న డాక్టర్ వైఎస్ఆర్ మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినికల్ సర్వీసెస్ కింద మొదటి దశలో 143 కోట్ల రూపాయలతో నియోజకవరగానికి ఒకటి చొప్పున 175 వెటర్నరీ అంబులెన్స్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా పశువుల సంక్షేమం కోసం భారతదేశంలోనే తొలిసారిగా ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న అంబులెన్స్ నెట్‌వర్క్ ఇదే కావడం గమనార్హం. ఇక ఈ వెటర్నరీ అంబులెన్స్‌లు ఆపదలో ఉన్న జంతువులకు సరైన సమయంలో చికిత్స అందించడానికి ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఇంటివద్దే పశువైద్య సేవలను అందించడం జరుగుతుంది. 54 అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ మొబైల్ అంబులెన్స్‌ల్లో 81 రకాల మందులతో కూడిన భారీ కిట్ ఉంటుంది. వీటిద్వారా స్పాట్ డయాగ్నసిస్ మరియు ఎమర్జెన్సీ కేసులకు హాజరవడంతో పాటు వెటర్నరీ ప్రథమ చికిత్స సేవలను అందిస్తారు.

ఈ అంబులెన్స్‌ల్లో జంతువులను ఎత్తడానికి మరియు వాటిని సమీపంలోని వెటర్నరీ డిస్పెన్సరీకి తరలించడానికి ‘హైడ్రాలిక్ లిఫ్ట్’ సౌకర్యం ఉంటుంది. ఒక్కో వాహనానికి నెలకు రూ.1.90 లక్షలు కేటాయించిన ప్రభుత్వం అంబులెన్స్ నిర్వహణను భరిస్తుంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,576 వెటర్నరీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయగా, 1,376 మంది వెటర్నరీ డాక్టర్లను నియమించారు. దీనిలో భాగంగా ప్రతి అంబులెన్స్‌లో ఒక వెటర్నరీ డాక్టర్‌, ఒక పారా వెటర్నరీ వర్కర్‌, డ్రైవర్‌ ఉంటారు. ఈ అంబులెన్స్‌లలో 24/7 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ కూడా ఉంటుంది. పశువుల యజమానులు 1962కు కాల్ చేసి సమాచారం అందిస్తే వెంటనే ఇంటివద్దకు వచ్చి చికిత్స అందిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here