ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్ళలో ప్రతిరోజూ ప్రత్యేక మోనూతో భోజనం, ఇంటర్నెట్‌ సౌకర్యాలు కల్పించాలి – సీఎం జగన్

AP Government Hostels And Schools , CM Jagan, AP Focus On Quality Food, Better Internet In Govt Schools, AP Govt on Hostels And Schools, AP Government, Mango News, Mango News Telugu, CM Jagan New Guidelines For Govt Hostels, CM Jagan New Guidelines For Schools, Better Food In Govt Hostels, Internet Facilities In Govt Schools, Food And Internet Facilities In Govt Hostels, Food And Internet Facilities In Govt Schools, AP CM YS Jagan Mohan Reddy, AP Gurukul Schools, AP Welfare Hostels

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం సమీక్షా సమావేశంలో అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. గురువారం గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు-నేడుపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విద్యాశాఖ అధికారులకి సీఎం జగన్ చేసిన ముఖ్య సూచనలు..

  • గురుకుల పాఠశాలల్లో అకడమిక్‌ బాధ్యతల పర్యవేక్షణ ఎంఈఓలకు అప్పగించాలి.
  • గురుకుల పాఠశాలలు, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ), వెనుకబడిన తరగతుల (బీసీ) మైనారిటీల సంక్షేమ హాస్టళ్లలో విద్యాపరమైన బాధ్యతల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలి.
  • ప్రతిరోజూ ప్రత్యేక మోనూతో భోజనం అందించాలి. హాస్టళ్లలో టీవీ, బెటర్ ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలి.
  • అలాగే హాస్టల్స్ శానిటేషన్‌పై దృష్టి సారించాలని, ప్రభుత్వ హాస్టళ్లకు వైద్యులు క్రమం తప్పకుండా వెళ్లాలని చెప్పారు.
  • మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, దోమల ప్రూఫింగ్, ఫర్నీచర్, బంకర్ బెడ్‌లు, చెత్త డబ్బాలు, వంటశాలల ఆధునీకరణ, క్రీడా సామగ్రి, లైబ్రరీ తదితర సదుపాయాలపై దృష్టి సారించాలి.
  • గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు-నేడు నిర్వహించాలని ఆదేశాలు.
  • ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ రూపొందించి వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =