వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం మే 13కు వాయిదా, అసని తుఫాన్‌ ప్రభావంతో నిర్ణయం

AP Govt Postpones YSR Matsyakara Bharosa Funds Release Program to May 13th, YSR Matsyakara Bharosa Funds Release Program to May 13th, Aandhra Pradesh Govt Postpones YSR Matsyakara Bharosa Funds Release Program to May 13th, AP Govt Postpones YSR Matsyakara Bharosa Funds, YSR Matsyakara Bharosa Funds, YSR Matsyakara Bharosa Funds Release Program Postpones to May 13th, YSR Matsyakara Bharosa Funds Release Program Postpones, YSR Matsyakara Bharosa Funds Release Program Postpones Due To Cyclonic Storm Asani, YSR Matsyakara Bharosa, YSR Matsyakara Bharosa Scheme Funds, Cyclonic Storm Asani News, Cyclonic Storm Asani Latest News, Cyclonic Storm Asani Latest Updates, Cyclonic Storm Asani Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకం నిధుల విడుదల కార్యక్రమం నేడు (మే 11, బుధవారం) జరగాల్సి ఉంది. అయితే మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని మే 13వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో మత్స్యకార భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి పాల్గొని, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో అసని తుఫాన్‌ వల్ల పలు జిల్లాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ముఖ్యంగా కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో, అధికారులు తుఫాను సహాయక చర్యల్లో సన్నద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావంతో సీఎం వైఎస్ జగన్ పర్యటన రద్దు కావడంతో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని మే 13, శుక్రవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు 2019 నుంచి ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం రూ.10 వేలు ఆర్ధికసాయం అందిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + six =