త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారబోతుంది, నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతాను – సీఎం జగన్

CM YS Jagan Calls To Invest in Vizag at AP Global Investor Summit Preparatory Meet at Delhi Today,CM YS Jagan Calls To Invest in Vizag,AP Global Investor Summit,Global Investor Summit Preparatory Meet at Delhi,Mango News,Mango News Telugu,Capital Of Andhra Pradesh,Vizag News,Vizag Capital News,Telangana Capital,Judicial Capital Of Andhra Pradesh,Jagan Visit To Vizag Today,First Capital Of Andhra Pradesh,Financial Capital Of Andhra Pradesh,Executive Capital Of Andhra Pradesh,Ap Capital Shifting To Vizag,3 Capitals Of Andhra Pradesh

త్వరలోనే విశాఖపట్నం పాలనా రాజధానిగా మారనుందని, నగరంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో జరగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023 సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత మూడేళ్ళుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉందని, పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి ముందుకు సాగడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక పెట్టుబడిదారులకు రాష్ట్రం తరపున మంచి సహకారం అందిస్తామని, వారి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని, ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల షిప్పింగ్ పోర్టులు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఇక రాష్ట్రంలో సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని, కేంద్రం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోన్న 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 ఏపీలోనే ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంతో త్వరలోనే విశాఖ పాలనా రాజధానిగా మారబోతోంది, తాను కూడా అక్కడినుంచే పరిపాలన కొనసాగించనున్నానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏపీలోనే అభివృద్ధి చెందిన నగరం వైజాగ్‌ అని, అందుకే ఇక్కడ పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం జగన్ ఇన్వెస్టర్లను కోరారు. కాగా ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇతర అధికారుల బృందం పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here