సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Appointed Working Committee On CPS Cancellation,Mango News,Breaking News Today,Latest Political News 2019,AP Political Updates,AP Govt Constitutes Working Committee,CPS Cancellation,AP Committee Chairperson,New Chief Secretary of Andhra Pradesh,AP Government Latest News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌) రద్దుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్‌ రద్దు అంశంపై పై రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్‌ కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఐదు శాఖలకు చెందిన కార్యదర్శులతో ఒక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ఆర్థిక కార్యదర్శి కన్వీనర్‌గా, ప్రణాళిక, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్ మరియు వైద్య శాఖ కార్యదర్శులను సభ్యులుగా నియమించారు, అలాగే కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యవరిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఎన్‌పి టక్కర్‌ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేస్తుంది. సీపీఎస్‌ రద్దు అంశంపై జూన్‌ 30లోపు నివేదిక అందజేయాలని వర్కింగ్‌ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 10 =