పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్ల పాటు నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోం శాఖ

Ministry of Home Affairs Declares Popular Front of India and its Affiliates as Unlawful Association for 5 Years, Central Home Ministry Issued Ban On Popular Front Of India For Five Years, Centre Bans Pfi, Banned PFI Associates For 5 Years, Cites PFI As Major Threat To Security, PFI Members, People Front Of India, NIA Anti Terror Raids on PFI Members, NIA Raids PFI Offices, NIA And ED Launch Massive Raids, Raids On PFI Cadres, NIA ED Raids On PFI Offices Across 10 States, NIA ED Conduct Massive Raids, Over 100 Leaders Of PFI Arrested, Mango News, Mango News Telugu, NIA ED Arrest Over 100 PFI Leaders, NIA And ED , NIA , ED , National Intelligence Agency, Enforcement Directory, NIA Latest Raids, National Intelligence Agency Latest News And Updates

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్​ఐ) మరియు దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించింది. అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తేదీ (సెప్టెంబర్ 27, 2022) నుండి ఐదు సంవత్సరాల పాటుగా నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం మరియు దాని ఫైనాన్సింగ్, లక్ష్యంగా చేసుకున్న భయంకరమైన హత్యలు, దేశ రాజ్యాంగ వ్యవస్థను విస్మరించడం, ప్రజా శాంతికి భంగం కలిగించడం వంటి తీవ్రమైన నేరాలలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్​ఐ) మరియు దాని సహచరులు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్‌లు పాల్గొన్నట్లు కనుగొనబడిందని, దేశ సమగ్రత, భద్రత మరియు సార్వభౌమత్వానికి అవి విఘాతం కలిగిస్తున్నాయని కేంద్ర హోం శాఖ పేర్కొంది.

అందువలన పీఎఫ్ఐ సంస్థ యొక్క కార్యకలాపాలను అరికట్టడం అవసరమని కేంద్ర హోం శాఖ గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో పీఎఫ్​ఐతో పాటుగా దాని అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్స్ అయిన రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహబ్ ఫౌండేషన్ కేరళ సంస్థలను చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటిస్తునట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =