వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Minister Singireddy Niranjan Reddy Inaugurates the Agriculture Ministry Call Center, Singireddy Niranjan Reddy Inaugurates the Agriculture Ministry Call Center, Agriculture Ministry Call Center, Telangana Minister Singireddy Niranjan Reddy Inaugurated the Agriculture Ministry Call Center, Singireddy Niranjan Reddy Starts the Agriculture Ministry Call Center, TS Minister Singireddy Niranjan Reddy Launches the Agriculture Ministry Call Center, Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy, Agriculture Minister Singireddy Niranjan Reddy, Telangana Minister Singireddy Niranjan Reddy, Minister Singireddy Niranjan Reddy, Singireddy Niranjan Reddy, Telangana Minister, Minister of Agriculture, Agriculture Ministry Call Center News, Agriculture Ministry Call Center Latest News, Agriculture Ministry Call Center Latest Updates, Agriculture Ministry Call Center Live Updates, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని రైతుబంధు సమితి అధ్యక్షుడి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ సేవల పరిశీలనకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుబంధు, రైతుభీమా అమలు, పంటల వైవిధ్యీకరణ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో రాష్ట్రంలోని 63 లక్షలమంది రైతుల ఫోన్ నంబర్లు ఉన్నాయని, అలాగే రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు త్వరలో అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్ తీసుకొస్తామన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులకు మరింత చేరువ అవుతామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్ల క్లస్టర్ పరిధిలో మరణించిన రైతు వెంకటేశ్వర్లు కుమారుడు రవీంద్రబాబుతో రైతుభీమా అందిన వివరాలను కాల్ సెంటర్ నుండి మాట్లాడి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రైతుభీమా ద్వారా అందిన సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుభీమా సొమ్ము మీ కుటుంబానికి భరోసానిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. మరోవైపు త్వరలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో పడతాయని, యధావిధిగా రైతుబంధు నిధులు విడుదల చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థిక శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fifteen =