అలకబూనిన మరో వైసీపీ నేత

YCP, AP, CM Jagan, MLA Anil kumar yadav, Jagan Mohan Reddy, MLA Kotamreddy Sridhar Redd, nellore, rajya sabha, Vemireddy Prabhakar Reddy, Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
YCP, AP, CM Jagan, MLA Anil kumar yadav

ఏపీలో దూకుడుగా వెళ్తోన్న.. వైసీపీ ఆరో జాబితాను కూడా ప్రకటించేసింది. ఈ జాబితాలో 6 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావుపేటకు పంపించింది. నరసరావుపేట లోక్ సభ స్థానం ఇంఛార్జ్‌గా ఆయన్ను ప్రకటించింది. అదే సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం ఇంఛార్జ్‌గా ఈసారి మైనార్టీకి జగన్ అవకాశమిచ్చారు. డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను నెల్లూరు సిటీ ఇంఛార్జ్‌గా నియమించారు.

అయితే అనిల్ కుమార్‌ను నరసరావుపేటకు పంపించడం బాగానే ఉన్నప్పటికీ.. ఆ స్థానంలో మైనార్టీకి అవకాశం ఇవ్వడాన్ని సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అనిల్ కుమార్‌ను నరసరావుపేటకు పంపిస్తారని వార్తలొస్తున్న క్రమంలో నెల్లూరు సిటీ టికెట్‌ను తన భార్య ప్రశాంతి రెడ్డికి ఇప్పించేందుకు కొద్దిరోజులుగా వేమిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ తర్వాత అక్కడ బలమైన నేత లేరని కచ్చితంగా ఆ టికెట్ తన భార్యకు దక్కుతుందని ఆయన భావించారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు సడెన్‌గా వైసీపీ ఆరో జాబితాను ప్రకటించేసింది. ఈక్రమంలో తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా నెల్లూరు సిటీ ఇంచార్జ్‌ను ప్రకటించారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనారు. అది కూడా మైనార్టీకి ఇవ్వడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈక్రమంలో నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేడర్‌ను వెంటనే నిలిపివేయాలని వేమిరెడ్డి ఆదేశించారట. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎండీ ఖలీల్‌కు ఎవరూ సహకరించొద్దని కోరారట. ఈ విషయం తెలిసి ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − seven =