అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక ప్రకటన

Director Ram Gopal Varma Announces to Make Political Film Titled Vyuham, Director Ram Gopal Varma, RGV Political Film Titled Vyuham, Vyuham Political Film, Mango News,Mango News Telugu, Vyuham Realpic, YS Jagan & Ram Gopal Varma's Vyuham, Ram Gopal Varma's Vyuham,Vyuham 2024 Elections, Rgv Meeting With Jagan,Ramgopal Varma Latest Movie Updates, Ramgopal Varma Latest News And Live Updates, RGV Vyuham, RGV Shapadam

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురువారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు. వ్యూహం పేరుతో మొదటి పార్ట్, శపథం పేరుతో సెకండ్ పార్ట్ తీస్తున్నానని, రెండింటిలోనూ రాజకీయాలు ఉంటాయన్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్ చేశారు.

“నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు, బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కథ, రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది. రాచకురుపుపైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

“ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది. మొదటి పార్ట్ వ్యూహం, సెకండ్ పార్ట్ శపథం. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 శపథంలో తగులుతుంది. వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు” అంటూ తనదైన శైలిలో రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ చేశారు. కాగా బుధవారం తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో రామ్ గోపాల్ వర్మ భేటీ అయినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ భేటీపై ఎలాంటి అధికారిక వెలువడలేదు. ఈ క్రమంలో వ్యూహం పేరుతో రాజకీయ సినిమా తీయనున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 9 =