టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్, ఏమన్నారంటే?

Minister KTR Responds Over 4 TRS MLAs Poaching Incident Urges Party Leaders to not Make Any Statements,4 TRS MLAs Poaching Incident, TRS MLA Balaraju, TRS MLA Rega Kantarao, TRS MLA Harshavardhan Reddy, MLA's Meet CM KCR at Pragati Bhavan, Mango News,Mango News Telugu, TRS MLAs Purchasing Issue, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలను పార్టీ ఫిరాయించాలంటూ ప్రలోభాలకు గురి చేశారంటూ సతీష్ శర్మ, సింహయాజి, నందకుమార్‌ అనే ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా తొలిసారి స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, టీఆర్‌ఎస్‌ నేతలు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని సూచించారు.

“ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు” మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =