టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తుకు రెడీ

AP BJP, alliances, BJP alliance with TDP,Pawan Kalyan, political Heat, Jagan, YCP, Janasena, Chandra babu,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
AP BJP, alliances, BJP alliance with TDP,Pawan Kalyan, political Heat, Jagan, YCP, Janasena, Chandra babu,

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ సర్కారును పడగొట్టి అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో ఏకమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలు ఒక తాటి పైకి వచ్చి.. తెలుగు దేశం పార్టీ నుంచి 94 మంది అభ్యర్థులను, జనసేన నుంచి ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న అనుమానాలు గట్టిగా వినిపించాయి. కనీసం బీజేపీ పెద్దల నుంచి ఈ పొత్తుల గురించి ఎలాంటి ప్రకటన కూడా రాకపోవడంతో ఇక ఏపీలో టీడీపీ, జనసేన మాత్రమే కూటమిగా పోటీ చేస్తాయని అంతా అనుకున్నారు.

నెల రోజుల క్రితం ఢిల్లీ  వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయి పొత్తులపై  దీర్ఘంగా చర్చలు జరిపారు.  ఈ సమయంలో బీజేపీ  పెద్దలు చంద్రబాబుకు కీలక ప్రతిపాదనలు చేశారు.  ఢిల్లీ నుంచి వచ్చిన పొత్తులపై ప్రకటన ఉంటుందని అంతా ఎదురు చూసారు. కానీ ఢిల్లీ టూర్  తరువాత చంద్రబాబు  ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరుగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకటించారు. అయితే తొలి జాబితాను ఈ ఇద్దరు నేతలు ప్రకటించడంతో బీజేపీ పొత్తుపై అనుమానాలు ప్రారంభమయ్యాయి.

తాజాగా  బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మూడు పార్టీలకు చెందిన నేతలు కలిసి  దీనిపై ఒక  ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో బీజేపీ అగ్ర నేతలు సమావేశమయినప్పుడు .. పది అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసిందన్న వార్తలు వినిపించాయి. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు మొగ్గు చూపకపోవడంతోనే  పొత్తులపై ఎక్కడా స్పందించలేదని తెలుస్తోంది. కానీ ఈ విషయంలో పవన్ ప్రత్యేక చొరవ తీసుకుని.. ఏపీలో పొత్తు ప్రాధాన్యత అంశంపై చర్చించడంతో బీజేపీ అధిష్టానం మెత్తబడినట్లు తెలుస్తోంది. పొత్తుపై ఒకటి రెండు రోజుల్లో బీజేపీ నేతలు  ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీ అడిగినన్ని కాకుండా ఆ పార్టీకి ఐదు అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలను ఇవ్వడానికి చంద్రబాబు  ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేనలు కలిపి తొలి జాబితాను ప్రకటించి.. 99 మంది అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తులో భాగంగా మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ఇంకా  ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు అంగీకారం తెలపడంతో.. ఐదు స్థానాలు బీజేపీకి, 52 స్థానాలు టీడీపీకి ఖరారు చేస్తారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =