మొట్టమొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ కిట్ విడుదల

First Indigenous Monkeypox RT-PCR Test Kit of India Launched at AP Medtech Zone, Monkeypox RT-PCR Test Kit of India Launched at AP Medtech Zone, AP Medtech Zone, Monkeypox RT-PCR Test Kit of India, First Indigenous Monkeypox RT-PCR Test Kit, Monkeypox RT-PCR Test Kit, RT-PCR Test Kit, First indigenous monkeypox RT-PCR Test Kit released, Transasia-Erba monkeypox RT-PCR kit, Monkeypox RT-PCR Test Kit News, Monkeypox RT-PCR Test Kit Latest News And Updates, Monkeypox RT-PCR Test Kit Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ అన్ని దేశాలు దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత్‌ లో కూడా ఇప్పటికే పలు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ పరీక్ష కోసం స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ శుక్రవారం నాడు విడుదలయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలోని మెడ్‌టెక్ జోన్ లో ట్రాన్సాసియా బయో-మెడికల్స్ సంస్థ ఈ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ కిట్ ను అభివృద్ధి చేసింది. ట్రాన్సాసియా-ఎర్బా పేరుతో రూపొందించిన ఈ కిట్‌ ను సెంటర్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ శుక్రవారం విడుదల చేశారు.

ట్రాన్సాసియా-ఎర్బా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ కిట్ మెరుగైన ఖచ్చితత్వం కోసం ప్రైమర్ మరియు ప్రోబ్ తో ప్రత్యేకంగా రూపొందించబడిందని, పరీక్ష కోసం ఉపయోగించడానికి సులభంగా ఉంటుందన్నారు. ఇన్‌ఫెక్షన్‌ను ముందస్తుగా గుర్తించి మెరుగైన చికిత్స తీసుకోవడంలో ఈ కిట్ సహాయపడుతుందని ట్రాన్సాసియా వ్యవస్థాపక ఛైర్మన్ సురేష్ వజిరానీ తెలిపారు. ఈ కిట్ విడుదల కార్యక్రమంలో సైంటిఫిక్ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారు డాక్టర్ అల్కా శర్మ, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eleven =