బస్తీ, పల్లె దవాఖానాల్లో 956 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

Telangana Govt Gives Green Signal to Recruit 956 MLHP Posts at Basthi Palle Dawakhanas, Green Signal to Recruit 956 MLHP Posts at Basthi Palle Dawakhanas, 956 MLHP Posts at Palle Dawakhanas, 956 MLHP Posts at Basthi Dawakhanas, Palle Dawakhanas, Basthi Dawakhanas, 956 MLHP Posts, MLHP Posts, Telangana Govt, MLHP Posts News, MLHP Posts Latest News And Updates, MLHP Posts Kit Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల్లో పోస్టుల నియామక ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మరియు మునిపాలిటీల పరిధిలోని బస్తీ దవాఖానాల్లో, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె దవాఖానాల్లో 956 ‘మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌’ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ (ఎన్హెఛ్ఎం)కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అనంతరం పోస్టుల భర్తీకి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలపై ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి ఉత్తర్వులు విడుదల చేశారు.

అందులో సబ్ సెంటర్లు/దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ వైద్యులతో మాత్రమే భర్తీ చేయబడతాయని, ఎంబీబీఎస్‌ వైద్యులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. అలాగే స్టాఫ్ నర్స్ పోస్ట్‌లు బీఎస్సీ (నర్సింగ్) మరియు 2020 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేట్ చేసిన వారితో రిక్రూట్ చేయబడతాయని లేదా 2020కి ముందు గ్రాడ్యుయేట్ చేసి జనరల్ నర్స్ మిడ్‌వైఫరీ (జిఎన్ఎం) చేసి కమ్యూనిటీ హెల్త్ లో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన బీఎస్సీ (నర్సింగ్) ఉన్న స్టాఫ్ నర్సులు అర్హులని తెలిపారు. ఇక వైద్యులకు నెలకు రూ.40 వేలు చొప్పున, స్టాఫ్‌నర్సుకు రూ.29,900 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =