సోషల్ మీడియాలో రీ సౌండ్ చేస్తున్న కౌంటర్లు

AP Assembly Elections,TDP,AP Politics,CM YS Jagan,Fold the chair.. Dialogue,Counters , social media,Chandrababu,jagan,Amarnath Reddy,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,AP
AP Assembly Elections,TDP,AP Politics,CM YS Jagan,Fold the chair.. Dialogue,Counters , social media,Chandrababu,jagan,Amarnath Reddy,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,AP

ఏపీలో నేతల మధ్య సీరియస్ డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రజా క్షేత్రంలో అయినా.. సోషల్ మీడియా అయినా సరే ఎక్కడ కూడా తగ్గేదే లే అంటూ అధికార, ప్రతిపక్ష నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. నువ్వొకటి అంటే నే రెండంటా అన్న చందంగా  నేతలంతా వరుస కౌంటర్లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్..వాలెంటీర్లంతా యుద్ధానికి సిద్ధం కావాలని..దీనికోసం చొక్కాలు మడతపెట్టి రెడీ అవ్వాలని చెప్పిన మాటలకు ..చంద్రబాబు గుంటూరు  కారం డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ప్రతీ మాటను  లెక్కలు వేసుకుని మాట్లాడే  చంద్రబాబు  నోటి నుంచి ఈ వైరల్ పదం రావడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ వచ్చింది.

జగన్..నువ్వు, నీ వైసీపీ వాళ్లు చొక్కాలు మడతపెడితే, మా తెలుగుదేశం సోదరులు, జనసైనికులు, ప్రజలు  కుర్చీలు మడతపెడతారన్న చంద్రబాబు..తాము కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా… జగన్ కుర్చీ లేకుండా పోతుందని కామెంట్ చేశారు. బాబుకు వంతపాడుతూ టీడీపీ, జనసైనికులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుండగా..ఈ ట్వీట్స్ వార్ లోకి అంబటి రాంబాబు రావడంతో పొలిటికల్ సీన్ మరింత హీటెక్కింది.

మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు కౌంటర్‌గా..ఇక్కడ ఉన్నది సింహాసనం. కుర్చీ కాదు.. మడతపెట్టడానికి’ అని చంద్రబాబు, లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన అలా ట్వీట్ చేయడమే ఆలస్యం.. టీడీపీ నుంచి కౌంటర్ అటాక్ మొదలయింది. ఎక్స్ వేదికగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. మేం కూడా అదే చెబుతున్నాం అంబటీ.. కుర్చీ అయితే మడత పెడతాం.. సింహాసనం అయితే.. దాని మీదున్న శునకాన్ని తరిమేస్తాం.. ఇది ఓకేనా..?’ అంటూ  రిప్లై ఇచ్చారు.

ఇక మరో నేత, మాజీ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి కూడా అంబటికి గట్టి కౌంటరే ఇచ్చారు. గతంలో అది సింహాసనమే కానీ ప్రస్తుతం అది గ్రామ సింహాసనం.. దానికా పేరు తెచ్చిన ఘనత ఎవరిదో నీకు తెలుసుగా అంబటీ..అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు. దీంతో గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి  సాంగ్ కంటే కూడా ఈ డైలాగే మరింత వైరల్ అవుతుందా ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో  వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 6 =