ఏపీ అసెంబ్లీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్

Budget Session of AP obstructed by TDP MLAs And got suspended, Four TDP MLAs Suspended From AP Assembly, Mango News, MLAs suspension Latest News, Revoke TDP MLAs suspension, TDP MLAs suspended for obstructing Budget Session of AP, TDP MLAs suspended from AP Assembly after row over YSRCP, TDP MLAs suspension Latest updates, Telangana Political News

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు సభ మొదలైన తరువాత, ఓటుకు నోటు, మద్యపాన నిషేధం,ఇతర అంశాలు సభలో చర్చకు వచ్చాయి.చర్చ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు కొనసాగాయి,ఈ తరుణంలో సభా కార్యకలాపాలకు పదే,పదే అడ్డుపడుతున్నారని నలుగురు టీడీపీ శాసన సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేసారు. టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయ స్వామి, వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్ లను సభనుండి సస్పెండ్ చేసారు.

స్పీకర్ నిర్ణయం తరువాత కూడ సభలోనే ఉండి నినాదాలు చేయడంతో వారిని మార్షల్స్ సహాయంతో సభ బయటకు పంపారు. ఈ రోజు సభ ముగిసేంతవరకు వారిపై సస్పెన్షన్ కొనసాగనుంది. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని జూలై 23 న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లను, ఈ బడ్జెట్ సమావేశాలకు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

 

[subscribe]
[youtube_video videoid=itwLyI7yYxs]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 1 =