తెలంగాణ సచివాలయ ముట్టడి, నాయకుల అరెస్ట్

Mango News, Opposition bid to lay siege to Inter board foiled, Opposition Parties decided to lay siege to the Secretariat, Stir against new Secretariat in Hyderabad foiled, Telangana Opposition Parties Against TRS party At Secretariat, Telangana Opposition Parties Tried To Lay Siege To Secretariat, Telangana Political News

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణ విపక్ష పార్టీలు పాత భవనాలే ఉంచాలని కొత్తవి అవసరం లేదని పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక పేరుతో జి.వివేక్ విపక్షాలతో కలిసి భవనాల కూల్చివేత పై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ని కలిసి భవనాల కూల్చివేత ఆపాలని వినతి పత్రం అందించారు, అంతే కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోమ్ మినిస్టర్ అమిత్ షా ని కూడ కలిసి కూల్చివేతలు అడ్డుకోవాలని వివరించారు.

ఈ రోజు ప్రజాస్వామిక తెలంగాణ వేదిక పిలుపు మేరకు అఖిల పక్షం ఆధ్వర్యంలో నాయకులు తెలంగాణ సచివాలయ ముట్టడికి ప్రయత్నం చేసారు. ఇందిరా పార్క్ నుండి ధర్నా చౌక్ వైపు ర్యాలీగా వెళ్తున్న నాయకులను ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో, ఇందిరా పార్క్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకుంది. తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్. రమణ లను ధర్నాచౌక్ కి వెళ్తుండగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. కెసిఆర్ కొత్త భవనాలు పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు.కొత్తగా సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు మానుకోవాలని డిమాండ్ చేసారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు.

 

[subscribe]
[youtube_video videoid=tCgfVyFDi3s]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =