ఏప్రిల్ 22న ఏపీ కేబినెట్‌ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ?

2021 AP Cabinet Meeting, Andhra Pradesh cabinet, Andhra Pradesh cabinet meeting, Andhra Pradesh Cabinet Meeting 2021, Andhra Pradesh Cabinet Meeting Dates, Andhra Pradesh cabinet meeting Latest News, Andhra Pradesh cabinet meeting News, Andhra Pradesh Cabinet Meeting will be Held on April 22, AP Cabinet Meeting, AP Cabinet Meeting 2021, AP Cabinet Meeting Updates, AP CM YS Jagan, Mango News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 22, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ ఇప్పటికే అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినేట్‌ భేటీలో చర్చించే అంశాలపై అన్ని శాఖలకు సంబంధించి నివేదికలను ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా పంపాలని ఆయా శాఖల అధికారులను సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ ఆదేశించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుపై సహా పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − three =