వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

Four YSRCP MLAS Suspended For Cross Voting in MLA Quota MLC Elections,Four YSRCP MLAS Suspended For Cross Voting,MLA Quota MLC Elections,MLC Elections,Mango News,Mango News Telugu,MLC Elections 2023,YSRCP Suspends Four MLAs for Cross Voting,Sajjala Announced 4 MLAs Suspension,YSRCP MP Margani Bharat Comments On 4 MLAs,After Cross voting Helped TDP Win MLC Seat,MLC Elections Latest News,MLC Elections Latest Updates,YSR Congress Party,AP MLC Elections

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డరంటూ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ వైఎస్సార్సీపీ చర్యలు తీసుకుంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలపై వేటు వేస్తున్నట్లుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు అంతర్గత విచారణలో పార్టీ గుర్తించిందని, ఈ నేపథ్యంలోనే నలుగురుపై సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు.

పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ తో చర్చించిన తర్వాతే, ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరగడంపై అంతర్గత విచారణ, దర్యాప్తు జరిపిన తర్వాతనే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చంద్రబాబు ఆఫర్‌ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eleven =