ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చివరిరోజు రెండు కీలక తీర్మానాలకు ఆమోదం, ప్రకటించిన సీఎం జగన్

AP Assembly Budget Session CM Jagan Announces will Send Two Important Resolutions For Centre Which Approved by Legislature,AP Assembly Budget Session,CM Jagan Announces Two Important Resolutions,Two Important Resolutions Which Approved by Legislature,Mango News,Mango News Telugu,AP Assembly Budget Session 2023-2024,AP Assembly Budget Session 2023,AP Assembly 2023,AP Assembly,AP Assembly Live Updates,AP Assembly Live News,AP Assembly Latest Updates,AP Assembly 2023 Live Updates,AP Assembly 2023 Latest News,AP Assembly Latest News,AP CM YS Jagan Mohan Reddy,AP Assembly 2023 State Budget,AP Assembly Budget News,AP Assembly Latest Budget Updates

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. మార్చి 14న మొదలైన సమావేశాలు దాదాపు 12 రోజుల పాటు కొనసాగి శుక్రవారంతో ముగిసాయి. ఈ క్రమంలో నేడు సమావేశాల చివరిరోజున రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. బోయ, వాల్మీకి కులస్థులను ఎస్టీల్లో చేర్చాలని ఒక తీర్మానం.. అలాగే దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని మరో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తాను 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారని, ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చామని గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేశామని చెప్పిన సీఎం జగన్.. రాయలసీమ జిల్లాల్లోని ఆయా కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్‌ పరిశీలించిందని, దీనిపై ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. ఇక రాష్ట్రంలోని దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తీర్మానం జరిగిందని స్పష్టం చేశారు. మతం మారగానే వారి సామజిక, ఆర్ధిక స్థితిగతుల్లో మార్పు రాదని, అందుకే వారిని ఎస్సీల్లో చేర్చాలని మరోసారి తీర్మానం చేశామని వివరించారు. ఈ రెండు తీర్మానాలను త్వరలోనే కేంద్రానికి పంపనున్నామని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాగా ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =