ఆడపిల్లల రక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎనిమిది స్పెషల్‌ కోర్టులు మంజూరు

AP Government Approves Set up Of 8 Special Courts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం దిశా పేరుతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడపిల్లల రక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎనిమిది స్పెషల్‌ కోర్టులను మంజూరు చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (పోక్సో) విచారణ కోసం ఈ కోర్టులు పనిచేయనున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోక్సో కేసులు వందకు పైగా పెండింగ్ లో ఉన్న చోట ఈ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం, భీమవరం, తెనాలి, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, మచిలీపట్నంలలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే జిల్లా జడ్జి క్యాడర్‌తో ఈ కోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =