కోపం వచ్చిందా? అయితే అద్దం ముందుకు వెళ్లి గట్టిగా అరవండి

Are You Angry But Go in Front of The Mirror and Shout Out Loud,Are You Angry,Go in Front of The Mirror and Shout,Are You Angry Shout Out Loud,Mango News,Mango News Telugu,Scream therapy, Traditional treatment of Chinese people,Standing in front of the mirror and shouting, Yelling is very good for health,Scream therapy Latest News,Scream therapy Latest Updates,Scream therapy Live News,Aggressive Body Language,Why do You Yell and Shout,Mirror Psychology,Scream therapy Latest News,Scream therapy Latest Updates

ఎప్పుడైనా మనకు ఎవరిమీద అయినా కోపం వచ్చినప్పుడు, హారర్ సినిమాలు చూసినప్పుడు, లేదంటే బాగా భయపడినప్పుడు మనకు తెలియకుండానే బిగ్గరగా అరుస్తాం. అయితే అలా అరవడం ఆరోగ్యానికి చాలా మంచిదని (Yelling is very good for health) అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనినే స్క్రీమ్ థెరపీ (Scream therapy) అని కూడా అంటారు. ఈ థెరపీ ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే ఉత్తమ మార్గం హారర్ సినిమాలు చూడటం మాత్రమే అంటున్నారు. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా రిలీఫ్ పొందొచ్చని చెబుతున్నారు.

స్క్రీమ్ థెరపీ చికిత్స విధానం స్టార్ట్ చేసేటప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది. లేదంటే హారర్‌ సినిమాలు (Horror Movies) చూసినా స్క్రీమ్ థెరపీలో వచ్చే ఫలితమే ఉంటుంది. స్క్రీమ్ థెరపీ అనేది చైనా ప్రజల సంప్రదాయ చికిత్స (Traditional treatment of Chinese people). ఇలాంటి చికిత్స ఉందని చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ ఆయుర్వేద నిపుణులకు తెలుసునని వాళ్లు పూర్తం ఇదే పద్ధతిని సూచించేవారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

స్క్రీమ్ థెరపీలో ఏం చేస్తారు?

చాలామందికి కోపం వస్తే గట్టిగట్టిగా అరవడం, చేతిలో వస్తువులు విసిరేయడం చేస్తుంటారు. అయితే అలా చేస్తే ఎదుటివారి మనసు మీద తీవ్ర ప్రభావం పడిపోతుంది. ఒక్కోసారి ఇంటి ప్రశాంత వాతావరణాన్నిచేతులారా నాశనం చేసిన వాళ్లం అవుతాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారి చిన్ని మనసులో వీరిపై పెద్ద ప్రభావమే పడుతుంది. అందుకే ఇలాంటివి చేసే బదులు స్క్రీమ్ థెరపీని ఆశ్రయించడం బెటరని నిపుణులు అంటున్నారు. ఈ థెరపీతో ఒక వ్యక్తి కోపాన్ని పోగొట్టుకోవడమే కాకుండా, నిరాశను కూడా తొలగించుకోవడానికి ఉత్తమ మార్గమని చెబుతున్నారు.

స్క్రీమ్ థెరపీ (Scream therapy) కోసం గదిలో తలుపులు వేసుకుని.. అద్దం ముందు నిలబడి గట్టిగా అరవడం (Standing in front of the mirror and shouting) బెటరని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది దీనిని నమ్మరు. కానీ ఇది చాలా ప్రయోజనాలు కలిగించడం ఆధారాలతో సహా వివరిస్తూ నిజమని వాదిస్తున్నారు నిపుణులు. అరవడం వల్ల వ్యక్తి నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుందట. మనస్సుకి ఒక విధమైన ఉపశమనం దొరుకుతుందట.

నిజానికి స్క్రీమ్ థెరపీ అనేది చైనీస్ వైద్య విధానాలలో ఒకటిగా చెబుతారు. సంప్రదాయ వైద్యంలో భాగంగా.. చైనా ప్రజలు వారి పెద్దల నుంచి ఈ అలవాటుని కొనసాగిస్తున్నారట. ఇలా గట్టిగా అరవడం వల్ల కాలేయం, ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం అని చైనీయులు కూడా చెబుతారు.
అయితే బిగ్గరగా అరవడం వల్ల.. పక్కవాళ్లు డిస్ట్రబ్‌ అయ్యే అవకాశం ఉంది కాబట్టి.. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ తలుపులు వేసుకుని అయినా ఈ ప్రయోగం చేస్తే బాగుంటుంది. కోపం వచ్చినప్పుడు ఇతరులపై అరవడం వల్ల వారు భయపడతారు. ఒక్కోసారి బాధపడతారు. అంతేకాదు అలా చేయడం మీ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =