ఆ స్థానం నుంచి యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ?

Yuvaraj singh, Lok sabha elections, MP, BJP, Sunny deol,Gurdaspur,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,ANDHRA PRADESH,AP Political updates,Mango News Telugu,Mango News
Yuvaraj singh, Lok sabha elections, MP, BJP, Sunny deol

సినీ నటులు, క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కామన్. ఇప్పటికే ఎంతో మంది సినీప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇటీవల దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అటు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌తో పాటు గౌతం గంభీర్‌లు కూడా ఎంపీలుగా కొనసాగుతున్నారు. అదే సమయంలో మరో దిగ్గజ క్రికెటర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అనిపించుకునేందుకు తహతహలాడుతున్నారు. అతనే స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్.

ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో.. ఆరు బాళ్లకు ఆరు సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించారు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు గొప్ప విజయాలు అందించారు. ఇటీవల అతి భయంకరమైన మెడియస్టినల్ సెమినోమా అనే కేన్సర్‌ను కూడా యువరాజ్ జయించారు. అమెరికాలో ఆ వ్యాధికి కీమోథెరపీ చికిత్స తీసుకున్నారు.  ఇప్పుడు పొలిటికల్ పిచ్‌లో రఫ్ఫాడించేందుకు సిద్ధమవుతున్నారు యువరాజ్ సింగ్.

త్వరలో యువరాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యువరాజ్ సింగ్ తన తల్లి షబ్నమ్ సింగ్‌తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో యువరాజ్ సింగ్.. రాజకీయాల్లోకి రానున్నారని.. బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెరపైకి వచ్చింది. అలాగే త్వరలో లోక్ జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా యువరాజ్ సింగ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ సన్నీ డియోల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో సన్నీ డియోల్ స్థానంలో యువరాజ్ సింగ్.. గురువాస్‌పూర్ నుంచి పోటీ చేయబోతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =