పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్

BRS Focused On Parliament Elections, Parliament Elections Focus BRS, BRS Parliament Elections Focus, BRS, KCR, Parliament Elections, Maharashtra, Latest BRS Parliament Elections News, BRS Parliament Elections News Updates, KTR, Parliament News, Politcal News, Telangana Parliament Elections, Telangana, Mango News, Mango News Telugu
BRS, KCR, Parliament Elections, Maharashtra

దేశ రాజకీయాల్లో రాణించాలని మొన్నటి వరకు ఉవ్విళ్లూరారు గులాబీ బాస్ కేసీఆర్. అందుకోసమే ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. రైతులను లక్ష్యంగా చేసుకొని ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్’ అనే నినాదంతో ముందుకు కదిలారు. ఇదే సమయంలో తెలంగాణలో ఎన్నికలొచ్చాయి. అనూహ్యంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి మారింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటి నుంచే ముందుకు అడుగులేస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోన్న గులాబీ పార్టీ.. ఈసారి మొత్తం 48 స్థానాలకు గురి పెట్టింది. తెలంగాణలోని 17 స్థానాలతో పాటు.. మహారాష్ట్రలో ఎంపిక చేసిన స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కేసీఆర్ పలుమార్లు కేసీఆర్ మహారాష్ట్రలో సభలు నిర్వహించారు. అతి తక్కువ సమయంలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో పాగా వేశారు. ముఖ్యంగా అక్కడి రైతులను టార్గెట్‌గా చేసుకొని.. వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇప్పటికే ఇటీవల జరిగిన మహారాష్ట్ర గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి 200లకు పైగా సర్పంచులు.. వార్డు సభ్యులు గెలుపొందారు.  అలాగే మహారాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి 20 లక్షలకు పైగా క్రియాశీల సభ్యులు ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మహారాష్ట్రలో 15 నుంచి 20 స్థానాలను దక్కించుకోవాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసి తీవ్రంగా చమటోడ్చుతున్నారు.

ఇప్పటికే మహారాష్ట్రలోని పలు చోట్ల బీఆర్ఎస్ పలుమార్లు బహిరంగ సభలు నిర్వహించింది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట మరోసారి ప్రజలను ఆకర్షించేందుకు బహిరంగ సభలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఔరంగాబాద్, షోలాపూర్,బీడ్, వార్డాల్లో త్వరలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించనుంది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందా..? మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను ఆశీర్వదిస్తారా..? అనేది చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 7 =