రైతులకు అండగా నిలవడం మా బాధ్యత, బురద రాజకీయాలు చేతకాదు : పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Appeals AP Officials to Take Initiative to Infuse Confidence in Farmers, Janasena Chief Pawan Kalyan Appeals AP Officials, AP Officials to Take Initiative to Infuse Confidence in Farmers, Pawan Kalyan Appeals AP Officials to Take Initiative to Infuse Confidence in Farmers, Janasena Chief Pawan Kalyan Says Its our responsibility to support farmers, AP Officials, support farmers, support farmers In AP, Pawan Kalyan Appeals AP Officials, Janasena Chief Pawan Kalyan, Janasena Chief, Pawan Kalyan, Chief Pawan Kalyan, support farmers In AP News, support farmers In AP Latest News, support farmers In AP Latest Updates, support farmers In AP Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో రైతులకు అండగా నిలవడం తమ బాధ్యతని, బురద రాజకీయాలు చేతకాదని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులలో మనోసైర్యాన్ని నింపే దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. “సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో పాలకపక్షం విఫలమవుతోంది. ఇందుకు రైతుల ఆత్మహత్యల ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు. కర్నూలు జిల్లా మేళిగనూరుకి చెందిన దేవరమణి జగదీష్, ప్రకాశం జిల్లా కాటూరివారి పాలేనికి చెందిన పాలగిరి రామ్మూర్తి పంట నష్టాలు, అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిసి దిగ్భాంతికి లోనయ్యాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బలవన్మరణానికి ఒడిగట్టాల్సిన పరిస్థితులు వారి ముందు ఉన్నాయంటే వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం లేదు అని అర్ధం అవుతోంది. బాధ్యతగల పార్టీగా జనసేన కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకొన్న వారి గురించి మాట్లాడుతుంటే పాలక పక్షం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోంది. రైతులకు అండగా నిలవడం జనసేన ఒక బాధ్యతగా చేపట్టింది. బురద రాజకీయాలు చేతకాదు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“ఆత్మహత్యలపై కూడా రాజకీయాలు మాట్లాడటం కట్టిపెట్టి అన్నదాతలకు ఏ విధమైన తోడ్పాటు ఇవ్వాలో బాధ్యతగల పదవుల్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తే మేలు. రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు, భూయజమానులకు ఊరట ఇస్తామని ఐఏఎస్ అధికారులు ప్రెస్ మీట్ ద్వారా వివరించడం రైతులకు కాస్త ఊరట కలుగుతుంది. భూ రికార్డుల్లో పొరపాటును సరిచేయమని అధికారుల చుట్టూ తిరిగి విసిగి ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉన్నత స్థాయి అధికారుల్లో కదలిక తెచ్చిందని అర్థమవుతోంది. సదరు రైతు సమస్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వెనుక ఏవైనా రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. సాగు నష్టాలు, అప్పులు, భూ రికార్డుల్లో లోపాలతో ఇక్కట్ల పాలై బలవన్మరణాల దిశగా రైతులు ఆలోచన చేసే పరిస్థితులు రాకుండా వ్యవస్థలు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాలి. ఉన్నతస్థాయి రెవెన్యూ, సర్వే అధికారులతో పాటు జిల్లా స్థాయిలో ఉన్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు రైతాంగంలో మనోస్టెర్యం నింపే దిశగా చొరవ తీసుకొని వారి సమస్యలు సత్వర పరిష్కారానికి మానవతా దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + fifteen =