పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి

Alla Ramakrishna Reddy Resigned From the Party and the Post of MLA,Alla Ramakrishna Reddy Resigned,Ramakrishna Reddy Resigned From the Party,From the Party and the Post of MLA,Party and the Post of MLA,Mango News,Mango News Telugu,AP Politics, YCP, Mangalagiri MLA Ramakrishna Reddy, BIG shock to CM Jagan,YSR Congress Party,Alla Ramakrishna Reddy Latest News,Alla Ramakrishna Reddy Latest Updates
AP Politics, YCP, Mangalagiri MLA Ramakrishna Reddy, BIG shock to cm jagan

అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా గరంగరంగా మారాయి.  అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవితో పాటు.. వైసీపీకి రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను లేఖను స్పీకర్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆర్కే స్పష్టం చేశారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. జగన్‌కి నమ్మిన బంటు.  అటువంటి వ్యక్తి ఇప్పుడు పదవికి, పార్టీకి రాజీనామా చేయడం పెను సంచలనంగా మారింది.

వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆర్కే.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌గా అధిష్టానం గంజి చిరంజీవిని నియమించే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం మంగళగిరిలో వైసీపీ కార్యాలయాన్ని చిరంజీవి ప్రారంభించారు. ఈసారి మంగళగిరి వైసీపీ టికెట్ కూడా చిరంజీవికే ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఈసారి టికెట్ రాదనే రామకృష్ణారెడ్డి పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

2014లో తొలిసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ను ఓడించి.. ఆర్కే విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో.. సీఎం జగన్ కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆర్కే ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో రామకృష్ణారెడ్డికి కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుంచే ఆర్కే అసంతృప్తితో ఉన్నారు. రెండేళ్లుగా సైలెంట్‌గా ఉన్న రామకృష్ణారెడ్డి సరిగ్గా ఎన్నికల ముందు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =