ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్ళీ మాస్క్ తప్పనిసరి?

Delhi Govt Plans To Impose Fine For Not Wearing Face Masks Amid Rising Covid Cases?, Delhi Govt Plans To Impose Fine For Not Wearing Face Masks, Face Mask Mandatory In Delhi, Fine For Not Wearing Face Masks, Face Masks, Amid Rising Covid Cases In Delhi, Delhi Covid Cases, Delhi Covid-19 Updates, Delhi Covid-19 Live Updates, Delhi Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Delhi, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, Mango News, Mango News Telugu,

న్యూఢిల్లీలో మరోసారి మాస్కులు తప్పనిసరి చేయనున్నారా? మాస్కుల ఉల్లంఘనకు పాల్పడితే ₹500 జరిమానా విధించనున్నారా? ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులను గమనిస్తుంటే త్వరలోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఈరోజు జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. దీని ప్రకారం నగరంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయనుంది. అలాగే దీనిని ఉల్లంఘించిన వారికి ₹500 జరిమానా కూడా విధించనుంది. అయితే ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తన సమావేశంలో.. పాఠశాలలను మూసివేయకూడదని నిర్ణయించిందని, యథావిధిగా పాఠశాలలు భౌతిక తరగతులను కొనసాగిస్తాయని తెలిపారు.

అయితే దీనిపై ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని తెలిపారు. మేము కోవిడ్ -19 పై దృష్టి సారించే ఉన్నాం. ఎందుకంటే ఇది ఎక్కువ కాలం కొనసాగుతుంది. నగరంలో కేసుల పెరుగుదలను బట్టి మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి, కేసులు పెరుగుతున్నా కూడా తీవ్రత తక్కువగా ఉందని, కనుక భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. నిపుణులతో సంప్రదించి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు సిసోడియా తెలిపారు. మరోవైపు దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు, అధికారులకు ఆదేశాలిచ్చి అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు మనీష్ సిసోడియా వెల్లడించ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =