కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపించాలి : పవన్ కళ్యాణ్

2021 AP MPTC ZPTC Elections, janasena chief, janasena chief pawan kalyan, Janasena Chief Pawan Kalyan Requests to Conduct Kadiyam MPP Election Smoothly, Janasena Latest News, Janasena Party, Kadiyam MPP Election, Mango News, MPTC ZPTC President Elections, pawan kalyan, Pawan Kalyan Requests to Conduct Kadiyam MPP Election, Pawan Kalyan Requests to Conduct Kadiyam MPP Election Smoothly

కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. “తూర్పుగోదావరి జిల్లా కడియం మండల జెడ్పీటీసీ స్థానంతో పాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాలను జనసేన పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 24వ తేదీన జరిగే మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. జనసేన పార్టీ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి, వారిని వారి కుటుంబ సభ్యుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన కడియం మండల ఎంపీటీసీలు మంగళవారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పరిషత్ ఎన్నికల్లో రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ తీవ్రమైన ప్రతికూలతల మధ్య బరిలోకి దిగింది. అధికార వైసీపీ దాష్టీకాలు, పోలీసుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొని 180 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, కడియంతో కలిపి రెండు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. అయితే 24వ తేదీ జరగబోయే మండలాధ్యక్ష ప్రక్రియ ఉన్న నేపధ్యంలో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు మీద వైసీపీ నాయకులు విపరీతమై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పోలీసుల యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని మా పార్టీ నేతలు నా దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ఇన్ని స్థానాలు గెలుచుకుని కూడా జనసేన గెలుచుకున్న స్థానాలు కూడా లాక్కోవాలనే ఉద్దేశ్యంతో మొండిపట్టుకుపోయి మా వారి మీద రకరకాల ఒత్తిళ్లు తెస్తూ, ప్రలోభాలు పెడుతున్నారు” అని పేర్కొన్నారు.

మావాళ్లను ఇబ్బంది పెట్టినా, ఓటింగ్ కి రానివ్వకున్నా స్వయంగా నేనే కడియపులంకకు వస్తా: పవన్

“ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మా నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, ఆడపడుచులకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం. 24వ తేదీన జరిగే మండలాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో గనుక మావాళ్లను ఇబ్బంది పెట్టినా, ఓటింగ్ కి రానివ్వకున్నా స్వయంగా నేనే కడియపులంకకు వస్తాను. మా వాళ్లకు ఎలాంటి అన్యాయం జరిగినా స్వయంగా నేనే వచ్చి తేల్చుకుంటా. అలాంటి పరిస్థితులు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే నేనూ దానికి సిద్ధంగానే ఉన్నా. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ దృష్టికి, రాష్ట్ర ఎన్నికల అధికారిణి నీలం సాహ్నీ దృష్టికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకువస్తున్నాను. ఎన్నిక సవుగా జరగకపోతే ఉత్పన్నమయ్యే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి. కడియం మండలాన్ని మేము కైవసం చేసుకోబోతున్నాం. దాన్ని అడ్డుకునే హక్కు అయితే మీకు లేదు. ఇలాంటివి చేస్తానంటే ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. ముందు ముందు కూడా మీ దౌర్జన్యాలను ఇలానే కొనసాగిస్తే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తాం. ముఖ్యంగా పోలీసు ఉన్నాతాధికారులు, జిల్లా అధికారులకు ప్రత్యేకించి ఒక విషయం చెబుతున్నాను. మా వాళ్ల మీద అమానుషంగా దాడులు జరగుతున్నాయి. మీరు ఒత్తిడులకు తలొగ్గి మా వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఈ పద్ధతిని సరిచేసుకోండి” అని పవన్ కళ్యాణ్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =