ఒంగోలులో 14 రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌, కలెక్టర్ ఉత్తర్వులు

14 Days Complete Lockdown In Ongole City, c, Complete Lockdown In Ongole City, Corona Outbreak, Lockdown, ongole, ongole coronavirus Updates, Ongole Lockdown, Ongole Lockdown For 14 Days, Ongole Lockdown News, Ongole Lockdown Updates

ఒంగోలు పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండడంతో మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల అనంతరం ఒంగోలు పట్టణాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ భాస్కర జూన్ 19, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వచ్చే ఆదివారం(జూన్ 21) నుంచి 14 రోజుల పాటు ఒంగోలులో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుకానుంది. లాక్‌డౌన్ సందర్భంగా ఎలాంటి సడలింపులు ఉండవని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం కోరింది.

మరోవైపు ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 268 కి చేరింది. జిల్లాలో బుధ, గురువారాల్లో వరుసగా 24, 38 కేసులు నమోదయ్యాయి. అలాగే చీరాలలో కూడా ఒకేరోజున 16 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7961 కి చేరింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 96 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =