రాజోలులో మళ్లీ జనసేనదే విజయం..!

Janasena Party Predicts That They Will Win Again in Razole Constituency,Janasena Party Predicts That, They Will Win Again in Razole Constituency,Janasena Again in Razole Constituency,Mango News,Mango News Telugu,Janasena wins, Rajolu,Janasena ,Rapaka Varaprasad,Bontu Rajeswara Rao,YCP, TDP,Janasena Latest News,Janasena Latest Updates,Janasena Live News

గత ఎన్నికల్లో ఏపీలో జనసేన ఒకే ఒక చోట విజయం సాధించింది అదే.. అప్పటి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు. అక్కడ జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ విజయం సాధించారు. ఇది మినహా రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని సీట్లను జనసేన కోల్పోయింది. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లోనూ ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత అక్కడ సీన్ మారిపోయింది. రాజోలు నుంచి గెలిచిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆనంతరం వైసీపీలోకి ఫిరాయించేశారు. జనసేనకు క్రమంగా దూరమవుతూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. చివరికి రాజోలు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిగా ఖాయమైపోయారు.

దీంతో గతంలో ఆయనపై పోటీ చేసి ఓటమిపాలైన వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు జనసేనలోకి ఫిరాయించారు. ఈసారి బొంతు రాజేశ్వరరావును అక్కడి నుంచి ఎలాగైనా గెలిపించుకోవాలని జనసేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రాజోలు సీటులో ఎవరు గెలవబోతున్నారనే దానిపై పొలిటికల్ క్రిటిక్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రాజోలు అసెంబ్లీ సీటులో ఈసారి ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ గెలవబోతున్నట్లు పొలిటికల్ క్రిటిక్ సర్వే వెల్లడించింది. అలాగే ఈ నియోజకవర్గంలో వైసీపీ మళ్లీ ఓటమిపాలవుతున్నట్లు సర్వే రిపోర్టు చెబుతోంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన రాజోలులో కాపుల జనాభా కూడా ఎక్కువ ఉండటం ఈ ఫలితానికి కారణమవుతున్నట్లు అర్ధమవుతోంది. అలాగే ఈ సీటులో ఏ పార్టీ ఎంత ఓటు శాతం తెచ్చుకోబోతోందన్నదీ ఈ రిపోర్ట్ వెల్లడించింది.

పొలిటికల్ క్రిటిక్ సర్వే ప్రకారం రాజోలు సీటులో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య పోటీ జరగబోతోంది. ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తాయని అనుకుంటే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో ఈ సర్వే వెల్లడించింది. దీని ప్రకారం లక్షా 86 వేల ఓట్లున్న ఈ గ్రామీణ నియోజకవర్గంలో జనసేన 36.85 శాతం ఓట్లు తెచ్చుకుని విజయం సాధించే అవకాశం ఉంది. రెండో స్ధానంలో ఉన్న వైసీపీకి 32.99 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అలాగే టీడీపీకి 27.81 శాతం ఓట్లు రాబోతున్నట్లు సర్వే వెల్లడించింది. దీంతో రాజోలు సీటును జనసేన నిలబెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here