కాపు రామచంద్రారెడ్డి రాజీనామా.. ఇండిపెండెంట్గా పోటీ

Kapu Ramachandra Reddy Resigns Contest as an Independent, Ramachandra Reddy Resigns, Ramachandra Reddy Contest Independent, YCP, Kapu Ramachandra Reddy Resigns, Contest as an Independent, YCP, CM JAGAN, Latest Ramachandra Reddy Resigns News, Ramachandra Reddy Latest News, YCP News, CM Jagan, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YCP,Kapu Ramachandra Reddy resigns, Contest as an Independent,YCP, CM JAGAN

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు  వైసీపీకి షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీకి  రాజీనామా చేయడంతో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం జగన్ కు పంపించారు.అయితే ఆ తర్వాత ఆయన సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్‌ను నమ్ముకుని కాంగ్రెస్‌ నుంచి వచ్చానని.. తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వలేదని రామచంద్రారెడ్డి మండిపడ్డారు

సీఎం జగన్‌ చెప్పిన ప్రతీ పని కూడా తాను చేశానని ఇప్పుడు… సర్వే పేరు చెబుతూ తనకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధగా ఉందని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని.. జగన్ తనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన ఫైర్ అయ్యారు.త్వరలో ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యా ణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని రామ చంద్రారెడ్డి ప్రకటించారు.

2009లో కాపు రామచంద్రారెడ్డి  కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2012లో జరిగిన బై ఎలక్షన్స్‌లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఏపీ రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన రామచంద్రారెడ్డి అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఇక 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి 14 వేల 49 ఓట్ల మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తాజాగా కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం..పైగా స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించటంతో ఏపీ రాజకీయాలలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =