కాంగ్రెస్‌ నుంచి లైన్లో డజన్ మంది

A Dozen People in Line from Congress, Dozen People in Congress, Congress Dozen People in Line, Leaders Eye on MLCs, Congress,Anjan Kumar Yadav, Shabbir Ali, Rohin Reddy, Feroze Khan,Janareddy, Madhuyashki, Chinnareddy, Sampath Kumar, Jaggareddy, Congress, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Leaders eye on MLCs, Congress,Anjan Kumar Yadav, Shabbir Ali, Rohin Reddy, Feroze Khan,Janareddy, Madhuyashki, Chinnareddy, Sampath Kumar, Jaggareddy

తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ షెడ్యూల్ వెలువడటంతో.. ఆశావహులంతా తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సభ్యుల సంఖ్య రీత్యా ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు చెరొక స్థానం దక్కుతుంది. కానీ ఒక్క స్థానం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు పన్నెండు మంది లైన్లో ఉన్నారు.

సీనియర్ల కోటాలో కొంతమంది, బీసీ కోటాలో ఇంకొంతమంది, మైనార్టీ కోటాలో మరి కొంతమంది తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు కూడా తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టేరు. ముషీరాబాద్, నిజామాబాద్ అర్బన్, అంబర్ పేట,నాంపల్లి సెగ్మెంట్ల నుంచి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు ఇలాగే బిజీ అయిపోయారు.

బీసీ కోటాలో తనకు ఎలా అయినా అవకాశం వస్తుందని అంజన్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ కోటాలో తనకే దక్కుతుందని షబ్బీర్ అలీ లెక్కలేసుకుంటున్నారు. సీఎంకు సన్నిహితుడిగా పేరున్న రోహిన్ రెడ్డి కూడా అదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం రోహిన్ రెడ్డికే  దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది.

సీనియర్ల కోటాలో జానారెడ్డి, మధుయాష్కీ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, జగ్గారెడ్డి ఈ అవకాశం కోసమే వేచి చూస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేరు కూడా  అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ నేత సంపత్ కుమార్ కూడా ఈ రేసులో ఉన్నారు. వీరితో పాటు పారిజాత నర్సింహారెడ్డి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందనేది అతి త్వరలోనే తేలనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న రెండు స్థానాల్లో.. ఒకటి బీఆర్ఎస్ కు దక్కనుండటంతో. ఈ సీటు కోసం ఏడుగురు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్‌లలో ఎవరో ఒకరికి ఈ టికెట్ దక్కవచ్చని తెలుస్తోంది.

వీరితోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ,స్టేషన్ ఘన్ పూర్ నుంచి తాటికొండ రాజయ్య తమ ప్రయత్నాల్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో..తనను ఎమ్మెల్సీగా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని, అందుకే ఇప్పుడు ఎలా అయినా ఈ స్థానం తనకే  దక్కుతుందని రాజయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించి రిజెక్ట్ అయిన దాసోజు శ్రవణ్​, కుర్ర సత్యనారాయణ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 11 =