2024లో మళ్ళీ మాకు 151 సీట్లు వస్తాయి.. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాల పొత్తులు – కొడాలి నాని

Kodali Nani Sensational Comments on The Prediction of TDP-Janasena Alliance in Next Elections, Prediction of TDP-Janasena Alliance in Next Elections, Kodali Nani Intresting Comments on The Prediction of TDP-Janasena Alliance in Next Elections, Kodali Nani Comments on The Prediction of TDP-Janasena Alliance in Next Elections, TDP-Janasena Alliance in Next Elections, TDP-Janasena Alliance, Kodali Nani discounted the TDP and Jana Sena claim of winning the 2024 elections, Kodali Nani Latest Comments on The Prediction of TDP-Janasena Alliance in Next Elections, Elections, 2024 elections, 2024 elections News, 2024 elections Latest News, 2024 elections Latest Updates, TDP-Janasena, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నేడు ప్రారంభమైన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా.. గుడివాడ 22వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో జరుగనున్న ఎన్నికలలో మళ్ళీ వైసీపీకి 151 సీట్లు వస్తాయని.. మిగిలిన 24 సీట్ల కోసమే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేశామని, అందుకే వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేక ఓటు లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీ చేసినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ప్రజల అవసరాలు తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని నాని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here