కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు

Bail Canceled for the Accused in Kodi Kathi Case Srinivas, Kodi Kathi Accused Bail Extended, Kodi Kathi Case Accused Srinivas Bail Got Cancelled, Mango News, NIA Court Cancelled Bail To Accused In YS Jagan Attack Case, Srinivasa Rao Bail Gets Cancelled In YS Jagan Kodi Kathi Case, Srinivasa Rao Kodi Kathi Case Latest News

గత సంవత్సరం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ ను ఈ రోజు హైకోర్టు రద్దు చేసింది. శ్రీనివాస్ బెయిల్ రద్దుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది, శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ఐఏ పిటిషన్ వేయగా హైకోర్టు ఈ రోజు విచారణ జరిపి, బెయిల్ రద్దు పై ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిన కోడి కత్తి సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. టిడిపి ప్రభుత్వ హయాంలో సిట్ విచారణ తరువాత, కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ఐఏ ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టింది.

2019,మే 23 తేదీన నిందితుడు శ్రీనివాస్ కి ఈ కేసులో విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, మే 25న బెయిల్ పై విడుదలయ్యాడు. జగన్ పై జరిగిన ఈ దాడి కేసులో విచారణ పూర్తి చేసి, ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నిందితుడికి బెయిల్ ఇవ్వడం వలన కేసు పక్కదారి పడుతుందని, సాక్షులు ప్రభావితమవుతారంటూ, బెయిల్ రద్దు చేయాలనీ ఎన్ఐఏ హైకోర్టులో వాదించగా, కోర్టు ఏకీభవించి బెయిల్ రద్దు చేసింది. బెయిల్ రద్దు నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ త్వరలోనే పోలీసుల ఎదుట లోంగిపోవాల్సి ఉంటుంది.

 

[subscribe]
[youtube_video videoid=giTXZ5opsJc]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eighteen =