పెద్దపెల్లి నుంచి లోక్‌సభ బరిలో కొప్పుల ఈశ్వర్?

Koppula Eshwar, Lok Sabha, Lok Sabha Constituency, Pedhapelli, Koppula Eshwar in the Lok Sabha Constituency from Pedtapelli, Lok sabha elections, Peddapalli constituency, BRS, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,Telangana News Live, Mango News Telugu, Mango News
Koppula eshwar, Lok sabha elections, Peddapalli constituency, BRS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన బీఆర్ఎస్.. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో కనీసం 12 స్థానాలయినా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. అలాగే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది.  ఈసారి దాదాపు మంది సిట్టింగ్ ఎంపీలను బీఆర్ఎస్ మార్చబోతోందని ప్రచారం జరుగుతోంది. అందులో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీని కూడా బీఆర్ఎస్ మార్చేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

ఇదే సమయంలో పెద్దపల్లి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి కొప్పుల ఈశ్వర్‌ను దించేందుకు బీఆర్ఎస్ ఆలోచిస్తుందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీల్లో కీలక నేతల్లో కొప్పుల ఈశ్వర్ ఒకరు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. వివాదరహిత నేతగా కొప్పులకు మంచి పేరు ఉంది. ఇప్పటికే కొప్పుల ఈశ్వర్ ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున ధర్మపురి నుంచి కొప్పుల బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్లూరి లక్ష్మణ్ చేతిలో ఈశ్వర్ ఓడిపోయారు.

ఈక్రమంలో ఈశ్వర్ పెద్దపల్లి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడు నియోకవర్గం. ప్రస్తుతం అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఎస్ కుమార్ ఈసారి పెద్ద పల్లి నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ నుంచి గడ్డం వివేక్ కుమారుడు వంశీ పోటీకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లు ఎక్కువ.

ఈ పరిణామాల మధ్య పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయడమే కరెక్ట్ అని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందట. అలాగే పెద్దపల్లిపై ఈశ్వర్‌కు మంచి పెట్టు ఉండడంతో.. పార్లమెంట్ ఎన్నికలకు ఆయన గట్టి అభ్యర్థి అవుతారని హైకమాండ్ అనుకుంటోందట. అందుకే ఈసారి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతను పక్కకు పెట్టి కొప్పుల ఈశ్వర్‌ను రంగంలోకి దింపాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + ten =