తండ్రికి లోక్‌సభ..కూతురుకు అసెంబ్లీ టికెట్

Loksabha For Father..Assembly Ticket For Daughter, Loksabha For Father, Assembly Ticket For Daughter, TDP, YCP, Janasena, Chandrababu, CM Jagan, Congress, YSRCP,Earle Anuradha, Budi Mutyala Naidu, CM Ramesh, Two Seats In One Family, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
TDP, YCP, Janasena, Chandrababu, CM Jagan, Congress, YSRCP,Earle Anuradha, Budi Mutyala Naidu, CM Ramesh

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును మళ్లీ మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ..మారిన రాజకీయ సమీకరణాలతో అనకాపల్లి ఎంపీ టికెట్‌ను అతనికి కేటాయించింది.  మాడుగులలో ఖాళీ అయిన ఎమ్మెల్యే టికెట్ ను ముత్యాలనాయుడు కూతురు ఈర్లె అనురాధకు కేటాయించడం అక్కడ హాట్ టాపిక్ అయింది. ఒకే కుటుంబం నుంచి తండ్రి లోక్‌సభకు , కూతురు  అసెంబ్లీకి పోటీ చేసి తమ లక్‌ను పరీక్షించుకోబోతున్నారంటూ చర్చలు  నడుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ..ఇటీవల ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 24ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అయితే  అక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌ పేరును ప్రకటించడంతో..అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించింది.అయితే ఇప్పటికే  మాడుగుల అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును ప్రకటించిన వైసీపీ అధిష్టానం..తాజాగా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో..ఆయన కూతురును మాడుగుల అభ్యర్థిగా ఖరారు చేసింది

ఈర్లె అనురాధ ప్రస్తుతం కే .కోటపాడు జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. వైసీపీ మహిళా విభాగంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారు. అంతేకాకుండా బూడి ముత్యాల నాయుడు రాజకీయ వారసురాలిగా జనంలో ఆమె బలమైన ముద్ర వేసుకున్నారు.డిప్యూటీ సీఎం హోదాలో పాలనాపరంగా తండ్రి బిజీబిజీగా ఉన్నప్పుడు.. అనురాధ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అంతేకాదు మాడుగుల నియోజకవర్గంలో ప్రచారాల నుంచి పార్టీ వ్యవహారాలు అన్నీ  అనురాధ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు అవకాశం రావడంతో అనురాధ శిబిరంలో జోష్ నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + three =