కాంగ్రెస్‌లోకి మల్లాది విష్ణు..?

Malladi Vishnu into Congress,Malladi Vishnu,Malladi into Congress,Malladi Vishnu, YCP, CM Jagan, AP Politics, AP Assembly Elections,Mango News,Mango News Telugu,Malladi Vishnu followers are Ready,MLA Malladi Vishnu,Malladi Vishnu Latest News,Malladi Vishnu Latest Updates,Malladi Vishnu Live News,Congress Latest News,Congress Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Malladi Vishnu, YCP, CM Jagan, AP Politics, AP Assembly Elections

వైనాట్ 175 అంటోంది వైసీపీ. 175కి 175 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. జనాదరణ తగ్గిన.. వ్యతిరేకత పెరిగిన సిట్టింగ్‌లను ఏమాత్రం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తున్నారు. పార్టీ గెలుపే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్‌లను ఛేంజ్ చేసిన జగన్.. తాజాగా మరో 27 మంది ఇంఛార్జ్‌లను కూడా మార్చేశారు.

అయితే జగన్ ఇంచార్జ్‌లను మారుస్తుండడంతో ఈసారి టికెట్ దక్కదని భావించిన నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈసారి మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ షాక్ ఇచ్చి.. ఆ టికెట్‌ను గంజి చిరంజీవికి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనయిన ఆర్కే ఎమ్మెల్యే పదవికి.. వైసీపీకా రాజీనమా చేశారు. అటు వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతోన్న విషయం తెలిసిందే. తన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈక్రమంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. తాను కూడా షర్మిల వెంటనే నడుస్తానని  ఆర్కే ప్రకటించారు.

ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్టు కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో విష్ణుకు జగన్ సీటు నిరాకరించారు. ఈసారి విష్ణును పక్కన పెట్టి విజయవాడ సెంట్రల్ టికెట్‌ను వెలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించారు. దీంతో అలకబూనిన విష్ణు త్వరలో వైసీపీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నారట. అటు తెలుగు దేశం, జనసేనలో చేరినప్పటికీ విష్ణుకు టికెట్ దక్కే అవకాశం లేదు. అందుకే కాంగ్రెస్‌లో చేరాలని విష్ణు నిర్ణయించారట.

ఇకపోతే 2009లో విష్ణు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో అసెంబ్లీ ఎన్నికల ముందు విష్ణు వైసీపీలో చేరారు. ఆ సమయంలో వైసీపీ విష్ణుకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వగా.. టీడీప అభ్యర్థి బొండా ఉమపై కేవలం 25 ఓట్ల మెజార్టీతో విష్ణు గెలుపొందారు. ఇప్పుడు మరోసారి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతో.. విష్ణు పార్టీలో మారాలని నిర్ణయించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత.. విష్ణు కూడా చేరనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 4 =