లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న మోక్షజ్ఞ

Lokesh Yuvagalam is a Mokshagna who participated in the padayatra,Lokesh Yuvagalam is a Mokshagna,Mokshagna who participated in the padayatra,Mokshagna participated in the padayatra,Mango News,Mango News Telugu,TDP, Yuvagalam padayatra, Lokesh, Nandamuri Mokshagna, Balakrishna,Nara Brahmini And Devansh Sudden Entry,Nandamuri Balakrishna Son Mokshagna,Nandamuri Mokshagna Reaction,Balakrishnas Son Takes His First Steps,Lokesh Yuvagalam Latest News,Lokesh Yuvagalam Latest Updates,Lokesh Yuvagalam Live News
TDP, Yuvagalam padayatra, Lokesh, Nandamuri Mokshagna, Balakrishna

సినిమాల్లో నటిస్తూనే, రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూనే.. వరుస సినిమాలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు దేశం పార్టీలో బాలకృష్ణ కీలకంగా కొనసాగుతున్నారు. అయితే ఇన్నిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ.. ఒక్కసారిగా పొలిటికల్ స్క్రీన్‌పై తలుక్కుమన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో మోక్షజ్ఞ పాల్గొన్నారు. దీంతో మోక్షజ్ఞ  పొలిటికల్ ఎంట్రీపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.

ఇకపోతే ఈ ఏడాది జనవరిలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఏపీలోని 92 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది. అయితే మధ్యలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడంతో రెండు నెలల పాటు పాదయాత్రను లోకేష్ నిలిపివేశారు. ఆ తర్వాత చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చాక.. నవంబర్ 26న తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నుంచి పాదయాత్రను తిరిగి  ప్రారంభించారు.

ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలో ప్రస్తుతం పాదయాత్ర సాగుతోంది. అయితే యువగళం పాదయాత్ర 3 వేల కి.మీ మైలురాయిని చేరుకోవడంతో తేటగుంట వద్ద  నారా లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో పాటు నందమూరి మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత లోకేష్‌తో కలిసి బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ పాదయాత్రలో పాల్గొని ముందుకు కదిలారు.

అయితే ఇన్నిరోజులు మోక్షజ్ఞ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏ ఒక్క రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఒక్కసారిగా యువగళం పాదయాత్రలో మోక్షజ్ఞ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. త్వరలో మోక్షజ్ఞ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారా?.. లేదా లోకేష్ కోసమే ఆ కార్యక్రమానికి హాజరయ్యారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 9 =