రేపు కేసీఆర్‌‌ను పరామర్శించనున్న సీఎం జగన్

CM Jagan Will Visit KCR Tomorrow, CM Jagan Will Visit KCR, Jagan Visit KCR Tomorrow, Kcr, Jagan, CM Jagan Meet kcr, Hyderabad, YCP, BRS, Latest Jagan and KCR Meetong News, Jagan and KCR Meetong News, Telangana, Andhra Pradesh, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Kcr, Jaga, CM Jagan meet kcr, Hyderabad, YCP, BRS

ఏపీలో రాజకీయ సమీకరణాలు అంచనాలకు కూడా అందడం లేదు. వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుడుతుండడంతో ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. నేతలందరూ ఎన్నికలపై ఫోకస్ పెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. వైసీపీని గద్దె దించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా జతకూడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అటు ఏపీపై పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను రంగంలోకి దింపుతోంది. షర్మిలకు పార్టీ పగ్గాలు అందివ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

అయితే ఇప్పటికే ఏపీ రాజకీయాలు భగ్గుమంటుండగా.. ఇంకా హీటెక్కించే పరిణామం చోటుచేసుకోబోతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్‌ను కలవబోతున్నారు. ఇటీవల కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో కాలు జారి పడడంతో ఆయన తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో వైద్యులు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఆసుపత్రితో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల నేతలు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, భట్టి విక్రమార్కలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.

అయితే కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో జగన్ పరామర్శించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పుడు కేసీఆర్‌ను పరామర్శించేందుకు జగన్ కేసీఆర్ ఇంటికి వెళ్తున్నారు. గురువారం హైదరాబాద్‌లోని కేసీఆర్ ఇంటికి జగన్ వెళ్లనున్నారు. నెల రోజుల తర్వాత అయినా కేసీఆర్‌ను పరామర్శించేందుకు వెళ్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఆయన వెళ్తున్న సమయం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ చేరబోతోందనే ప్రచారం ఒకవైపు.. కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వడం మరో వైపు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్‌ను జగన్ కలవడం ఆసక్తికరంగా మారింది.

అయితే ముందు నుంచి కూడా కేసీఆర్, జగన్ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. అటు కేటీఆర్, జగన్‌లు కూడా మంచి స్నేహితులే. ఈ విషయాన్ని పలు మార్లు కేటీఆర్ వెల్లడించారు. రాజకీయంగా తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని.. రాష్ట్రాల పరంగా మాత్రమే ఉంటాని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే 2018లో కేసీఆర్ రెండోసారి సీఎం కావాలని జగన్ కోరుకున్నారు. ఈ మేరకు సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్‌కు పడేలా కృషి చేశారు. అటు జగన్ కూడా సీఎం కావాలని కేసీఆర్ కోరుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత ఎన్నికల ముంగిట కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =